అసలు ఎవరు ఈ భోలే బాబా..? ఎందుకు అయన దర్శనం కోసం ఇంత మంది వెళ్ళారు..?

Ads

ఉత్తరప్రదేశ్‌లోని సికంద్రారావు పట్టణానికి దగ్గరలో హాథ్‌రస్ జిల్లాలోని రతీఖాన్‌పూర్‌లో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం నాడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ తొక్కిసలాట జరిగింది. దాదాపు 116 మంది ఈ తొక్కిసలాటలో చనిపోయారు అని అదే రోజు సాయంత్రం ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ మనోజ్ కుమార్ తెలిపారు. మృతులలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న భోలే బాబా పాద దూళి తీసుకోవడం కోసం చాలామంది భక్తులు వచ్చారు.

who is bhole baba

అక్కడే జనం ఎక్కువ అయ్యి తొక్కిసలాట అవ్వడంతో ఇలాంటి సంఘటన జరిగింది. దాంతో ఈ భోలె బాబా ఎవరు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. భోలే బాబా పేరు నారాయణ సాకార్ హరి. ఎటా జిల్లాలోని పాటియాలి తహసల్‌కు చెందిన బహదూర్ గ్రామానికి చెందినవారు. గతంలో ఇంటిలిజెన్స్ బ్యూరో ఉద్యోగిగా కూడా చేశారు అనే ఒక వార్త ఉంది. 26 సంవత్సరాల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం, ఆధ్యాత్మికత గురించి అందరికీ అవగాహన కల్పించడం మొదలుపెట్టారు. ఆయనకి దేశవ్యాప్తంగా ఎన్నో లక్షలాది మంది భక్తులు ఉన్నారు.

Ads

దేశవ్యాప్తంగా మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో మంది భక్తులు భోలే బాబా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి తరలి వస్తూ ఉంటారు. భోలే బాబా సామాజిక మాధ్యమాల్లో కూడా లేరు. వాటన్నిటికీ చాలా దూరంగా ఉంటారు. ప్రతి మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో బోలె బాబా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎంతోమంది భక్తులు ఈ కార్యక్రమానికి వస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు భక్తులకి అవసరమైన ఆహార సదుపాయాలని, ఇతర వసతులను కూడా వాలంటీర్లు ఏర్పాటు చేస్తారు. క

రోనా సమయంలో కూడా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. అప్పుడు కూడా ఎంతో మంది భక్తులు వెళ్లారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో రెండు గంటల 30 నిమిషాల తర్వాత ఈ తొక్కిసలాట జరిగింది. గాయపడిన వారిని సికంద్రారావు సీహెచ్‌ఎస్‌ కి తీసుకెళ్లారు. ఈ విషయం మీద ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Previous articleచెల్లెలి పెళ్లి ఆగిపోయింది… భార్య వదిలేసి వెళ్ళిపోయారు..! రచనలతో సంచలనం సృష్టించిన ఈ వ్యక్తి గురించి తెలుసా..?
Next article“పోకిరి” నుండి “పుష్ప” వరకు… సమాజానికి “చెడు సందేశం” ఇచ్చిన 10 హిట్ సినిమాలు..!