చిరంజీవి ఫ్యామిలీని తిట్టడం వల్ల టాలీవుడ్ లో అవకాశాలు కోల్పోయిన వారు ఎవరో తెలుసా?

Ads

సిని పరిశ్రమలో నటులు, రైటర్, డైరెక్టర్ అయిన సరే మంచి సినిమాలు చేస్తే పాపులారిటీ వస్తుంది. దానితో పాటు మరిన్ని అవకాశాలు వస్తాయి. అలా వారు సినిమా చాలా కాలం ఇండస్ట్రీలో కొనసాగుతారు.

Ads

కానీ తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ కావాలి అంటే మెగాస్టార్ ఫ్యామిలిని తిడితే చాలన్నట్టు ఉంది కొందరి వైఖరి. పాపులర్ కావడం కోసం తిడితే అవకాశాలు రాకపోగా, అందరి దృష్టిలో వారే బ్యాడ్ అవుతారే కానీ ఇంకేం రాదు. మరి మెగా ఫ్యామిలీని తిట్టడం వల్ల ఛాన్సులు లేక ఖాళీగా ఉన్నవారేవరో ఇప్పుడు చూద్దాం.
రైటర్ చిన్నికృష్ణ: 
ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ రచయితగా పేరు పొందిన చిన్నికృష్ణ మెగాస్టార్ చిరంజీవిని మరియు ఆయన ఫ్యామిలీని తిట్టారు. చిరంజీవి ఫ్యామిలీ అసలు ఎవ్వరికీ కూడా ఏ సాయం చేయరు. వారు ఎవ్వరినీ కూడా  ఎదగనివ్వరు అని అన్నాడు. అయితే ఆయన మాటలకు అప్పుడే చాలా మంది చిరంజీవి నుండి  సహాయం పొందినవారు రియాక్ట్ అయ్యారు. అయితే చిన్నికృష్ణ మెగాస్టార్ పై ఫేక్ ఆరోపణలు చేశాడని  చిన్నికృష్ణని బాయ్ కట్ చేయడం జరిగింది.
శ్రీ రెడ్డి:
అప్పట్లో శ్రీ రెడ్డి ఇండస్ట్రీలో అమ్మాయిలకి జరుగుతున్న అన్యాయం, కాస్టింగ్ కౌచ్ గురించి బహిరంగంగా చెప్పింది. ఆమె దగ్గుబాటి అభిరామ్ గురించి కూడా రచ్చ చేసింది, అయితే ఆ సందర్భంలోనే శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ ని బాగా తిట్టింది. అప్పటి నుండి ఇండస్ట్రీలో ఎవరు కూడా శ్రీ రెడ్డికి చిన్న పాత్ర కూడా ఇవ్వడం లేదు.
పోసాని కృష్ణ మురళి
ఒకప్పుడు పోసాని కృష్ణ మురళి స్టార్ హీరోల చిత్రాలకు రచయితగా చేస్తూ బిజీగా ఉండేవాడు. కొంత కాలానికి నటుడిగా మారి ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించాడు. పోసాని పవన్ కళ్యాణ్ గురించి మరియు మూడు పెళ్లిళ్ల గురించి తిట్టాడు. అప్పటి నుండి పోసానిని పెద్దగా సినిమాల్లోకి తీసుకోవట్లేదు. Also Read: పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమాకి ముందుగా ఏ టైటిల్‌ అనుకున్నారో తెలుసా?

 

Previous article“అంబాసిడర్” కార్ ఖరీదు 1964 లో ఇంత తక్కువా? వైరల్ అవుతోన్న బిల్..
Next articleఎన్టీ రామారావు తన కొడుకులకి ఆస్తి ఎంత ఇచ్చారో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.