Ads
సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే మనకు గుర్తుకు వచ్చేది అంబులెన్స్. యాక్సిడెంట్ జరిగినప్పుడు లేదా ఎవరైనా విషం తీసుకున్నప్పుడు కానీ, పాము కరిచినా, హఠాత్తుగా ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే 108 ఫోన్ నంబర్ కి కి కాల్ చేస్తారు.
Ads
కాల్ చేసిన వెంటనే సైరన్ చేసుకుంటూ అంబులెన్స్ ప్రమాద జరిగిన స్థలానికి చేరుకుటుంది. ప్రమాద బాధితులను వెంటనే దగ్గరలోని హాస్పటల్ కి తీసుకువెళుతుంది. ఇక ఈ ప్రక్రియ మొత్తం కూడా 108 ద్వారానే జరిగుతుంది. అయితే ఎప్పుడైనా 108 అంబులెన్స్ కు ఆ పేరు ఎందుకు పెట్టారని కానీ, ఎలా వచ్చిందని కానీ ఆలోచించారా? మరి ఎందుకు పెట్టారో? ఆ నంబర్ వెనుక ఉన్న అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..ఇండియా భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్నటువంటి దేశం. అయితే మనదేశంలో ఎక్కువ శాతం హిందువులే ఉన్నారు. అంతేకాకుండా వీరు ఎక్కువగా పూజలు చేస్తూ, దైవ ఆరాధన చేస్తూ ఉంటారు. ఇక భారతీయులకు 108 ను అత్యంత పవిత్రమైన సంఖ్యగా భావిస్తారు.అందువల్ల దేవుడి కోసం కట్టే పూలదండలో సరిగ్గా 108 పువ్వులు ఉండేలా జాగ్రత్త పడతారు. ఇక ధ్యానం కోసం వాడే జపమాలలో కూడా 108 పూసలని ఉండేట్టు చూసుకుంటారు. దేవాలయం చుట్టూ తిరిగేటప్పుడు కూడా 108 వచ్చేట్టుగానే చూసుకుంటారు.
భూమి, చంద్రుడు, సూర్యుడు దూర వ్యాసం కూడా సరిగ్గా 108 సార్లు వస్తుంటుంది. శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్లయితే మన దేశంలో 108 ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.ఉపనిషత్తుల సంఖ్య కూడా 108 ఉండడం విశేషం. ఇస్లాం మతంలో 108 సంఖ్యను దేవుడితో పోలుస్తారు. ఇది మాత్రమే కాకుండా సాధారణంగా మానవుడు మరణించిన తరువాత ఆత్మ 108 ఘట్టాలను దాటుకుని వెళ్తుందని ముస్లింలు నమ్ముతారు. కొందరు దీని ప్రకారమే అంబులెన్స్ 108 సంఖ్య పెట్టి ఉంటారని భావిస్తున్నారు.
సైకాలజి పరంగా కూడా ఈ 108 సంఖ్యకు ప్రత్యేకత ఉంది. మనిషి డిప్రెషన్ లో ఉన్న సమయంలో వారి చూపు మొబైలులో ఎడమ భాగం వైపున చివరికి వెళ్తుందట. అయితే అక్కడ 0,8 దగ్గరగా ఉండడం వల్ల 108 ని ఎమర్జెన్సీ నంబర్ గా ఎంచుకుని ఉంటారని అనుకుంటున్నారు. ఇంకొక కథనం ప్రకారం తొలి సంఖ్య అయిన 1 మగవారిని,0 ఆడవారిని సూచిస్తాయని ఇక 8వ నంబర్ ఇన్ఫినిటీ సూచిస్తుందని, ఈ కారణాల నేపథ్యంలోనే అంబులెన్స్ కు 108 సంఖ్య ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Also Read: అక్కడ పావురాలకి ఆహారం వేయడం తప్పు..ఇంకో దగ్గర హై హీల్స్ వేసుకోకూడదు… 6 అయితే మరీ తమాషాగా వుంది చూడండి..!