లవ్ టూడే మూవీ హీరోయిన్ ఇవానా షాజీ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు..

Ads

సినీపరిశ్రమలో అవకాశాలు అందుకున్నవారిలో కొంతమంది కేవలం ఒక్క చిత్రంతోనే బాగా పాపులర్ అవుతారు. అలా సినీరంగంలో ఉన్న చాలామంది హీరో హీరోయిన్లు ఒక్క సినిమాతోనే ఎంతో పాపులరిటీని  తెచ్చుకున్నారు.

Ads

తాజాగా ఓ హీరోయిన్ కూడా అలానే పాపులారిటీని సంపాదించుకుంది. ఆ బ్యూటీ పేరు ఇవానా షాజీ. లవ్ టుడే మూవీ ద్వారా తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకున్న మలయాళీ ముద్దుగుమ్మ ఇవానా. ఈ సినిమాతోనే  టాలీవుడ్ కి పరిచయం అయింది.
డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో వచ్చిన “లవ్ టుడే” మూవీ యువతని బాగా ఆకట్టుకున్న సంగతిఅందరికి తెలిసిందే. తమిళంలో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా అయ్యింది. ఈ సినిమా రూ. 5 కోట్ల బడ్జెట్ తో రూపొందగా, అరవై కోట్ల వరకు వసూల్ చేసి ఆశ్చర్యపరిచింది. తమిళంలో హిట్ అవడంతో ఈ సినిమాని తెలుగులో అదే పేరుతోనే తెలుగులోకి ప్రొడ్యూసర్ దిల్ రాజు విడుదల చేశారు. ఇక్కడ కూడా హిట్ అందుకుంది. ఇక ఇటీవల ఓటిటిలో రీలజ అవగా,అక్కడ కూడా మంచి ఆదరణ లభిస్తోంది.ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం చేస్తూ,హీరోగా నటించిన ఈ మూవీలో ఇవానా హీరోయిన్ గా నటించింది. తన అందం పాటుగా అభినయంతోను తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. నిఖిత పాత్రలో నటించిన నటించిన ఇవానా తన నటనతో ఆడియెన్స్ నవ్వించి, ఏడిపించింది. ఈ మూవీ ద్వారా ఎంతోమంది ఆడియెన్స్ ని తన అభిమానులుగా మార్చుకున్న ఇవానా నేపద్యం ఏమిటో తెలుసుకోవటానికి నెటిజెన్లు సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు. ఇక ఇవానా బాలనటిగా మలయాళీ సినీ రంగంలో అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది.
గత సంవత్సరంలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, మాస్టర్స్,హీరో, పద్మిని లాంటి చిత్రాలలో నటించి గుర్తింపు పొందింది. ఇక ఇటీవల వచ్చిన లవ్ టుడే చిత్రంలో నటించి ఇటు టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు కోలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇవానా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అప్పుడప్పుడు పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అలా ఇవానా అధిక సంఖ్యలో ఫాలోవర్స్ ని కలిగి ఉంది. లవ్ టుడే సినిమా హిట్ అవటంతో ఆమెకు కోలీవుడ్ లో అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఈ 6 విలన్స్ రెమ్యూనరేషన్ ఎంతో మీకు తెలుసా..?

Previous articleహీరోయిన్ గా మాత్రమే కాకుండా విలన్ రోల్ లోనూ అలరించిన 14 మంది హీరోయిన్లు..
Next articleఅంబులెన్స్ కు ‘108’ నంబర్ పెట్టడం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.