Ads
కారు కొనడం అనేది మధ్యతరగతి మనిషి కల అని చెప్పవచ్చు. అందువల్లే వారు జీవితంలో మొదటిసారి కారు కొనుగోలు చేసిన సందర్భాన్ని ఒక పండుగలా సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు.
అయితే ఎవరైనా కొత్త కారుని కొన్నప్పుడు షోరూమ్ ఓనర్లు, కారు కొనుగోలు చేసిన వ్యక్తికి ఒక పెద్ద తాళం చెవి ఇవ్వడం, దానితో పాటు ఫోటో తీసుకోవడం చేస్తుంటారు. ఆ తాళం చెవిని వారు ఉపయోగించలేరు. మరి ఆ కీతో ఎందుకు ఫోటో తీసుకుంటారో ఇప్పుడు చూద్దాం..
ఎవరైన కొత్త కారును కొనుగోలు చేసినపుడు, లేదా కారును కస్టమర్స్ కు డెలివరీ చేస్తున్నప్పుడు, పెద్ద కీని వారికి ఇచ్చి, కీ తో పాటుగా కస్టమర్ ఫొటోలను తీస్తుంటారు. ఇది చాలా కాలం నుండి సాధారణంగా మారింది. ఇక కారు కొన్న చాలా మంది కస్టమర్లు ఆ కారు ముందు నిలబడిన తమ ఫోటోలను సంతోషంగా సామాజిక మధ్యమాలలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఫొటో తీసుకున్న తరువాత పెద్ద కీని మాత్రం కారు కొనుగోలు చేసిన ఓనర్‌కి ఇవ్వరు. ఆ కీని కేవలం ఫోటో దిగడం కోసమే కస్టమర్లకు ఇస్తారు.
షోరూమ్ ఓనర్లు ఇలా చేయడం వెనుక మార్కెటింగ్ ట్రిక్ ఉందని తెలుస్తోంది. ఒరిజినల్ తాళం చెవి చాలా చిన్నగా ఉంటుంది. ఆ కీతో ఫొటో తీసుకున్నా కూడా ఫొటోలో అది కనిపించదు. కేవలం కారు కొన్నామని పోజు ఇవ్వడం కోసం ఫోటో తీసుకున్నారని ఇతరులు అనుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా పెద్ద కీతో ఫొటో తీసుకోవడం వల్ల కార్ కంపెనీకి బ్రాండింగ్ జరుగుతుంది. ఆ పెద్ద కీ పై కంపెనీ లోగో కూడా ఉంటుంది. కస్టమర్లు ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల ఆ కంపెనీకి ఉచిత ప్రమోషన్ జరుగుతుంది.
కొత్త కారు కొన్న కస్టమర్లకు పెద్ద తాళం ఇచ్చి, కారు ముందు నిలబెట్టి ఫోటోలు తీయడం వల్ల షోరూం ఓనర్లు తమ కస్టమర్లకు ఆత్మసంతృప్తిని కలిగిస్తారు. కారు కొనుగోలు చేయడం చాలా మందికి కల, అలాంటి కల నెరవేరిన క్షణం జీవితంలో మరిచిపోలేనిది. అందువల్ల ఆ సంతోషకరమైన సందర్భాన్ని ఫొటో తీస్తారని తెలుస్తోంది.
Ads
Also Read: అంబులెన్సు కి “108” నెంబర్ ఎందుకు పెట్టారు..? సైన్స్ ఏం చెబుతోంది..? హిందూ ధర్మం ఏం చెబుతోంది..?