“అనంత్ అంబానీ” బరువు గురించి కామెంట్ చేస్తున్నవారు… అలా జరగడానికి కారణం ఏంటో తెలుసుకున్నారా..? విషయం ఏంటంటే..?

Ads

కొంత కాలం భారతదేశం అంతా కూడా ఒకవైపు మాత్రమే చూసింది. అదే ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా చేశారు. అంబానీ ఇళ్లలో చిన్న చిన్న ఫంక్షన్స్ కి చాలా ఘనంగా సెలబ్రేషన్స్ జరుగుతాయి.

అలాంటిది వాళ్ళింట్లో ఇలాంటి పెద్ద వేడుకకి ఇంకా ఎంత ఎత్తున సెలబ్రేషన్స్ జరగాలి. అందుకే, హాలీవుడ్ పాప్ సింగర్స్ కూడా ఈ వేడుకలో పాల్గొని పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బాలీవుడ్ టాప్ హీరోలు, హీరోయిన్లు, సింగర్స్ కూడా ఇందులో పాల్గొని అలరించారు.

why did anant ambani gain weight

బాలీవుడ్ ప్రముఖులు అందరూ కూడా అంబానీ ఇంట్లో జరిగే ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఎంతో మంది వ్యాపారవేత్తలు కూడా వచ్చారు. రాజకీయ నాయకులు, ఇంకా క్రీడారంగానికి చెందిన ఎంతో మంది ప్రముఖులు కూడా ఈవెంట్ జరిగిన జాంనగర్ కి వెళ్లారు. ప్రముఖ డిజైనర్లు అంబానీ కుటుంబం కోసం ప్రత్యేకంగా దుస్తులు తయారు చేశారు. ఇదిలా ఉండగా, అనంత్ అంబానీ తన తండ్రి ముఖేష్ అంబానీ స్థాపించిన సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సఫలం అయ్యారు.

why did anant ambani gain weight

తండ్రికి తగ్గ కొడుకు అనే మాట వింటూ ఉంటాం. కానీ దాన్ని నిజం చేసి చూపించారు. అనంత్ అంబానీ ఎన్నో సార్లు మీడియా ముందుకి వచ్చారు. అయితే, అంతకుముందు బరువుగా ఉండే అనంత్ అంబానీ, తర్వాత బరువు తగ్గారు. మళ్లీ బరువు పెరిగారు. 2013 సమయంలో ఐపీఎల్ మ్యాచ్ లకి వచ్చినప్పుడు బరువుగా ఉన్న అనంత్ అంబానీ, 2016 లో బరువు తగ్గారు. అంతకుముందు 208 కిలోలు ఉండేవారు. దాని నుండి 100 కేజీలకి చేరారు. తర్వాత మళ్లీ బరువు పెరిగారు.

Ads

why did anant ambani gain weight

దీనికి కారణాన్ని నీతా అంబానీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అనంత్ అంబానీకి ఆస్తమా ఉంది. దాన్ని కంట్రోల్ చేయాలి అంటే స్టెరాయిడ్స్ వాడాలి. వీటి వల్ల అనంత్ బరువు పెరుగుతున్నట్టు 2017 లో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా తన కొడుకు లాగానే బరువు పెరగడం అనే విషయంతో డీల్ చేస్తున్న చాలా మంది ఉంటారు అని, వారందరిని గౌరవించాలి అని నీతా అంబానీ చెప్పారు. ఆస్తమా వంటి సమస్య ఉన్నవారికి వైద్యులు సాధారణంగా స్టెరాయిడ్స్ తీసుకోమని సూచన ఇస్తారు. ఇలా చేయడం వల్ల శ్వాసకోశాల్లో వాపు తగ్గుతుంది. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదు.

why did anant ambani gain weight

కానీ ఇవి తీసుకోవడం వల్ల ఆకలి ఎక్కువగా ఉంటుంది. వ్యాయామాలు చేయడానికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఈ కారణంగానే బరువు పెరుగుతారు. ఇదే విషయాన్ని క్లుప్తంగా అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ని పెళ్లి చేసుకోబోతున్నారు. వీరిద్దరూ గత కొంత కాలం నుండి ప్రేమలో ఉన్నారు. గత సంవత్సరం వీరి నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు పెళ్లికి ముందు జరుగుతున్న ఈ సెలబ్రేషన్స్ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ALSO READ : 1964 లో “అంబాసిడర్ కారు” ధర ఎంతో తెలుసా.? అప్పటి ఈ బిల్ ఒక లుక్ వేయండి.!

Previous articleచెల్లి పెళ్లిలో “సాయి పల్లవి” ధరించిన ఈ చీర ఖరీదు ఎంతో తెలుసా.?
Next articleపెళ్ళికి ముందు రోజు అబ్బాయి వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఏం చేసింది..? ఈ సినిమా చూశారా..?