1964 లో “అంబాసిడర్ కారు” ధర ఎంతో తెలుసా.? అప్పటి ఈ బిల్ ఒక లుక్ వేయండి.!

అంబాసిడర్ కారుకి ఒకప్పుడు ఎంతో క్రేజ్ ఉండేది. అప్పట్లో మట్టి రోడ్ల మీద ఆ కారు వెళ్తుంటే అందరు వింతగా చూస్తూ ఉండేవారు. ఈ కార్లు ఎక్కువ తెలుపు రంగులోనే ఉండేది. అంబాసిడర్ కారును ఎక్కువగా  రాజకీయ నాయకులు, సినీ సెలెబ్రెటీస్ వాడేవారు. ప్రస్తుతం ఈ కార్ల వాడకం తగ్గింది. అయితే  అంబాసిడర్ కారు ధరకు సంబంధించి ఒక ఇన్ వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అంబాసిడర్‌తోనే కార్లంటే క్రేజ్ ఏర్పడిందని చెప్పవచ్చు. గతంలో ఎక్కువగా రాజకీయ నాయకులు, అలనాటి స్టార్ హీరోలు వాడుతూ ఉండేవారు. సినిమాలలోనూ ఎక్కువగా ఉపయోగించేవారు. అప్పట్లో  అంబాసిడర్ కారు ఉందంటే, వారిని గొప్పగా, ధనవంతులుగా చూసేవారు. ఎన్ని రకాల కార్లు వచ్చినప్పటికి అంబాసిడర్ కారు రేంజ్ వేరు. 1990 దశకం దాకా ఈ కార్ల హవా నడిచింది. ఈ కారును 1957లో హిందూస్థాన్ మోటార్స్ రిలీజ్ చేసింది. ఈ కార్ బ్రిటిష్ కారు ఆధారంగా తయారుచేయబడింది. మారుతీ సుజుకీ వచ్చినప్పటి నుండి ఈ కార్లకు ఆదరణ తగ్గింది. అయితే ఇప్పటికీ కొంతమందికి  అంబాసిడర్ కార్లను వినియోగించేందుకు ఇష్టపడుతుంటారు.

ఇక అంబాసిడర్ కార్ల కొనుగోలు తగ్గడంతో హిందూస్థాన్ మోటార్స్ 2014లో వీటి ఉత్పత్తిని ఆపివేసింది. అప్పుడు ఆ కారు ఖరీదు నాలుగు లక్షలకు పైన ఉండేది. అయితే ఈ కార్లను ఇంకా ఇష్టం పడేవారు  ఇప్పటికి కూడా  ఆ కార్లను రిపేర్లు చేయించుకుంటూ వాడుతున్నారు. అయితే ఈ కారు వచ్చిన తొలి రోజుల్లో ఖరిదు ఇంతా అని చెప్పలేం. తాజాగా 1964 లోని అంబాసిడర్ కార్ యొక్క ఇన్వాయిస్ బిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ బిల్ లో దాని ఖరీదు 16, 495 రూపాయలు అని ఉంది. 1964వ సంవత్సరంలో మద్రాసులో ఉండే గుప్తాస్ స్టేట్స్ హోటల్‌ అంబాసిడర్ కార్ ను కొన్నట్లుగా ఆ ఇన్వాయిస్ బిల్ లో ఉంది.

దీనిని రిలయన్స్ మోటార్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ జారీ చేసిన ఈ ఇన్ వాయిస్ బిల్ లో అకౌంటంట్, బ్రాంచ్ మేనేజర్ సంతకాలు ఉన్నాయి. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ బిల్ ను చూసిన నెటిజన్లు అప్పట్లో అంబాసిడర్ కారు అంత తక్కువగా ఉండేదా అని ఆశ్చర్య పోతున్నారు. కొందరు ఆ కార్ తో వారికి ఉన్న అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటన్నారు. ఒక నెటిజెన్ స్పందిస్తూ మా నాన్న 1972లో అంబాసిడర్ కారును 18000కి కొనుగోలు చేశారని అని రాసుకొచ్చారు.

Also Read: ఈ పాలసీ కార్డు ఉంటే ఆసుపత్రి బిల్స్ కి రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు..

 

Previous articleఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ఈ “హన్సిక” వెబ్ సిరీస్ చూసారా.? అసలు ఇందులో ఏముంది.?
Next articleబేబమ్మ లాగే…ఇక్కడ అవకాశాలు తగ్గి మలయాళ బాట పడుతున్న టాప్ హీరోయిన్లు ఎవరంటే.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.