పెళ్ళికి ముందు రోజు అబ్బాయి వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఏం చేసింది..? ఈ సినిమా చూశారా..?

Ads

ఒక సినిమా అంటే ఫైటింగ్ సీన్లు, భారీ బడ్జెట్ పాటలు ఉండాల్సిన అవసరం లేదు. మామూలు కథని ఆసక్తికరంగా చూపించినా కూడా ప్రేక్షకులు చూస్తారు. అలాంటి ఒక కథతో వచ్చిన సినిమా ఇదే. ఈ సినిమా పేరు, అర్చన 31 నాట్ అవుట్. ఐశ్వర్య లక్ష్మి ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకి అఖిల్ అనిల్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక ఊరిలో టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది అర్చన (ఐశ్వర్య లక్ష్మి). ఎన్నో పెళ్లి సంబంధాలు చూసిన తర్వాత 31వ పెళ్లి సంబంధం అర్చనకి నచ్చుతుంది. పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి.

movie based on a story of a woman

 

పెళ్లికి ముందు రోజు పెళ్ళికొడుకు గతంలో అతనిని ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోతున్నట్టు చెప్తాడు. కానీ ఈ విషయాన్ని అర్చన తన ఇంట్లో వాళ్లకు చెప్పదు. పెళ్లి ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇంట్లో వాళ్ళు ఎవరికీ కూడా ఈ విషయం తెలియదు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. ఒకే ఒక్క రోజులో సినిమా కథ చాలా వరకు మొత్తం నడుస్తుంది. అయినా కూడా తర్వాత ఏమవుతుంది అని ఆసక్తితో సినిమా నడిపించారు. 2022 లో వచ్చిన ఈ సినిమా మలయాళం భాషలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది.

Ads

 

ఈ సినిమాలో డైలాగ్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయి. అందులోనూ సినిమా చివరిలో హీరోయిన్ తీసుకునే నిర్ణయం, అప్పుడు హీరోయిన్ ఇచ్చే స్పీచ్ చాలా బాగా రాశారు. పెళ్లి అనే ఒక విషయం ఒక అమ్మాయి జీవితాన్ని నిర్ణయించదు అనే విషయాన్ని ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. పెళ్లికి ముందు రోజు పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయి పారిపోతే, ఈ విషయాన్ని ఆ అమ్మాయి ఎంత జాగ్రత్తగా పరిష్కరించింది అనేదాన్ని ఈ సినిమాలో చూపించారు. సినిమాలో చాలా తక్కువ మంది నటీనటులు ఉంటారు. పెద్ద పెద్ద సెట్టింగ్స్ కూడా ఉండవు. ఒక ఊరిలో ఇంట్లో సినిమా నడుస్తుంది. ఆడపిల్లలు ఈ సమాజంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారో చాలా సున్నితంగా ఇందులో చూపించారు. ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చూపించారు.

ALSO READ : “పోకిరి” నుండి “పుష్ప” వరకు… సమాజానికి “చెడు సందేశం” ఇచ్చిన 10 హిట్ సినిమాలు..!

Previous articleశ్రీదేవితో ఉన్న ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎవరో తెలుసా.? నలుగురితో కలిసి నటించిన ఒకే ఒక్క హీరో ఎవరంటే?
Next articleపవన్ కళ్యాణ్ పక్కన ఉన్న ఈ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.