చిరంజీవి బర్త్ డే సందర్బంగా ట్రెండ్ అవుతున్న 10 ఎడిటడ్ వీడియోస్..ఫాన్స్ కి పూనకాలే..!!!

Ads

మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా పలు రకాల వీడియోలు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంస్టాగ్రామ్ దగ్గర నుంచి ట్విట్టర్ వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని ఫ్యాన్ బేస్డ్ వీడియోస్ తో వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా కొత్తిమీర ట్వీట్స్ వాళ్ళు చేసిన ఫ్యాన్ బేస్డ్ వీడియో బాగా వైరల్ అయింది.

చిరంజీవి దగ్గర నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ ,సాయి ధరమ్ తేజ.. ఇలా మెగా హీరోల అందరికీ సంబంధించిన వీడియో ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలు మెగా కుటుంబం హవా ఏ రేంజ్ లో ఉందో తెలుపుతుంది. ఇక చిరంజీవి యాక్టింగ్ కి సంబంధించిన వీడియోస్ అయితే ఒకప్పటి చిరంజీవి సినిమాలను బాగా గుర్తు చేసే విధంగా ఉన్నాయి.

అలాగే ఒక స్టేజ్ షోలో పాటిస్పేట్ చేసిన చిరంజీవి తన అభిమానులతో కలిసి చిందులు వేసే వీడియో మరింత ముచ్చటగా ఉంది. బాస్ రా బచ్చా అంటూ చిరంజీవి కెరీర్ కి పునాదిరాళ్లు వేసిన చిత్రాల దగ్గర నుంచి హైలైట్ మూవీస్ కి సంబంధించిన గ్లింప్స్ చూపించే వీడియో మరింత ఆకట్టుకుంటుంది.

కొణిదెల శివశంకర వరప్రసాద్…సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ప్రఖ్యాతిగాంచిన చిరంజీవి ,ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా తన కెరీర్ నీ మొదలుపెట్టి తెలుగు సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మెగాస్టార్ అని నిరూపిస్తూ పలు రకాల కార్యక్రమాలతో అభిమానులకు ఎప్పుడు దగ్గరగా ఉండే చిరంజీవి ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

watch video:

Ads

Previous articleఅనుష్క, సమంత లాగే…. సినిమా కోసం వయసులో తమకంటే చిన్న హీరోలతో జతకట్టిన 16 మంది హీరోయిన్లు.!
Next articleసినిమా విడుదలకు వారం కూడా లేదు… ఈ టైమ్‌లో సమంత ఎందుకు ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నారు..?