Ads
ఈ మధ్యకాలంలో అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో ప్రతి ఒక్కరు కూడా మందుల మీద ఆధారపడి ఉంటున్నారు. కానీ నిజానికి మందుల రేట్లు కూడా విపరీతంగా ఉంటున్నాయి. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వేలల్లో మందులకే అయిపోతోంది. కానీ మామూలు మందులు కంటే జనరిక్ మందులు తక్కువ ధరకే మనకి దొరుకుతూ ఉంటాయి. ఎప్పుడైనా మీకు సందేహం కలిగిందా..? ఎందుకు జనరిక్ మెడిసిన్స్ తక్కువ ధరతో ఉంటాయి…? మామూలు మెడిసిన్స్ లాగ జనరిక్ మెడిసిన్స్ కూడా పని చేస్తాయి కదా..
మరి వాటిని ఎందుకు తక్కువ ధరకే అమ్ముతూ ఉంటారు మీకు ఈ సందేహం ఉంటే వెంటనే క్లియర్ చేసుకోండి. ఏదైనా మెడిసిన్ ని తీసుకురావాలంటే దానికి టెస్టులు చేస్తూ ఉంటారు. అప్పుడు ప్రొసీజర్ అంతా పూర్తయిన తర్వాత ఆ మందుని మార్కెట్లోకి తీసుకు వస్తూ ఉంటారు.
Ads
పైగా మందు కోసం ఎన్నో ప్రయోగాలు చేస్తారు కనుక డబ్బు కూడా ఎక్కువే ఖర్చు అవుతుంది. ఏదైనా మందు సక్సెస్ అయితే దానికి పేటెంట్ రైట్ ఇస్తారు కొంత కాలం తర్వాత పేటెంట్ రైట్ ముగిసాక ఆ మందుని సేమ్ ఫార్ములా తో మళ్ళీ తయారు చేసుకోవచ్చు. పేటెంట్ రైట్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కంపెనీలు అదే మందును మళ్ళీ తయారు చేస్తారు ఇలా జనరిక్ మెడిసిన్స్ ని తయారు చేయడం జరుగుతుంది. అయితే జనరిక్ మెడిసిన్స్ కి మళ్ళీ రీసెర్చ్ అని టెస్టింగ్ అని చేయక్కర్లేదు.
డైరెక్ట్ గా ఫార్ములాతో మందుని తయారు చేసుకుని వాటిని సేల్ చేసుకో వచ్చు. అయితే ఇక్కడ రీసెర్చ్ టెస్టింగ్ వంటివి ఉండవు కాబట్టి తక్కువ ధరకే మందులని తయారు చేసుకో వచ్చు. అందుకే ఈ మందులు తక్కువ ధరకి అందుబాటులో ఉంటాయి. తక్కువ ధర లోనే మనం వాటిని కొనుగోలు చేయొచ్చు.