ఎడమ చేతికే ఎందుకు వాచీ ని పెట్టుకోవాలి..? దాని వెనుక కథ ఏంటి అంటే..?

Ads

ఇది వరకు టైం తెలియాలంటే కచ్చితంగా వాచి ఉండేది. వాచ్ ని ప్రతి ఒక్కరూ చేతికి పెట్టుకునేవారు. టైం తెలుసుకోవాలంటే వెంటనే వాచ్ ని చూసి టైం తెలుసుకునేవారు కానీ ఈ రోజుల్లో ఫోన్ ఉండడంతో చాలామంది వాచీలని పెట్టుకోవడం మానేశారు ఒకవేళ పెట్టుకున్నా దానిని ఉపయోగించడమే మానేశారు. టైం ని ఫోన్ లోనే చూస్తున్నారు రోజురోజుకి టెక్నాలజీ పెరిగిపోవడంతో కొత్త కొత్త డివైస్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇవి అందర్నీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

కొత్త డివైస్లు వస్తే పాత వాటిని ఉపయోగించడం మానేసాము స్మార్ట్ వాచ్ లు స్మార్ట్ బాండ్లు ఇప్పుడు ఎక్కువమంది వాడుతున్నారు అయితే రిస్ట్ వాచ్ అయిన స్మార్ట్ వాచ్ లేదా స్మార్ట్ బ్యాండ్ ఏదైనా కూడా దాదాపుగా ఎడమ చేతికే పెట్టుకుంటూ ఉంటారు ఎందుకు ఎడమ చేతికి పెట్టుకోవాలి కుడి చేతికి పెట్టుకోకూడదు ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Ads

ఎప్పుడైనా మీరు ఈ విషయాన్ని గమనించారా..? ప్రతి ఒక్కరూ కూడా వాచ్ ని ఎడమ చేతికే పెట్టుకుంటారు. ఎప్పటి నుండో ఇదే పద్ధతి నడుస్తోంది. మొదట్లో పాకెట్ వాచీలు ఉన్నాయి ఇప్పుడు అంటే చేతికి పెట్టుకుంటున్నాము. వాళ్లతో పాటు తీసుకు వెళ్లేవారు. టైం కావాల్సి వచ్చినప్పుడు పాకెట్ లో నుండి తీసి చూసే వాళ్ళు. అలా మొట్టమొదట ధరించడం జరిగింది ఆ తర్వాత ఎడమ చేతికి వాచీలని పెట్టుకోవడం మొదలుపెట్టారు.

ఎందుకంటే చాలామంది కుడి చేతివాటం కలవారు కాబట్టి. కుడి చేత్తో పని చేస్తున్నప్పుడు మాటిమాటికీ చేతిని పైకి లేపి టైం చూడడం అవ్వదు ఒకవేళ కనుక ఎడమ చేతికి పెట్టుకుంటే ఈజీగా మనం ఏ పని చేసినా కూడా చూసుకోవచ్చు. అప్పట్లో అది సౌకర్యవంతంగా అనిపించింది దాంతో ఎడమ చేతికే వాచీ ని పెట్టుకోవడం మొదలుపెట్టారు అప్పుడు మొదలైన పద్ధతి ఇంకా ఇప్పుడు కూడా ఆచరిస్తున్నాము రాయడం వంటివి కూడా కుడి చేత్తో చేసినప్పుడు ఎడమ చేతికి వాచి ఉంటే టైం చూసుకోవడం ఈజీగా ఉంటుంది.

Previous article“ఎలాగో రాజస్థాన్ గెలుస్తుంది అనుకుంటే.. చివరికి ట్విస్ట్ ఇచ్చారుగా.? ..అంటూ రాజస్థాన్ VS లక్నో మ్యాచ్ పై 10 ట్రోల్స్..!
Next articleథియేటర్స్ లో I, O వరుసలు ఉండవు.. ఆ సీట్లు ఎందుకు వుండవు అంటే..?