Ads
మన బరువు అనేది మనం తీసుకునే ఆహారం బట్టి ఉంటుంది. మనం తినే ఆహారం లో మార్పులు చేసుకుంటే సులభంగా బరువు తగ్గొచ్చు. అయితే జపాన్ లో ఉండే వాళ్ళని ఎప్పుడైనా మీరు చూశారా…? వాళ్ళు చాలా సన్నగా ఉంటారు. పైగా ఊబకాయం రేట్ తక్కువగా జపాన్ లోనే ఉంది.
జపాన్ లో కేవలం నాలుగు శాతం మంది మాత్రమే ఊబకాయం సమస్య తో బాధపడుతూ ఉంటారని రీసెర్చ్ చెబుతోంది. అయితే ఇక్కడ ఎందుకు ఊబకాయంతో బాధపడే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు..? ఎందుకు ఇక్కడ ప్రజలు సన్నగా ఉంటారు అనే విషయాలను చూద్దాం.
#1.తీసుకునే ఆహారం:
- మనం తీసుకున్న డైట్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
- మరి జపాన్ లో ఉండే వాళ్ళు ఏం తీసుకుంటారు అనేది చూస్తే… జపాన్లో ఉండేవాళ్ళు సన్నగా ఉండడానికి ముఖ్య కారణం వాళ్ళు తీసుకునే ఆహారం. ఈ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా తక్కువగా ఉంటాయి. వీళ్ళు తీసుకునే ముఖ్య ఆహార పదార్థాలలో కూరగాయలు, సీ ఫుడ్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ తీసుకోవడానికి జపాన్ వాళ్ళు చేపలు మరియు ఇతర సీ ఫుడ్ మీద ఆధారపడి ఉంటారు.
- మాంసాన్ని చాలా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకుంటూ ఉంటారు.
- డైరీ ప్రొడక్ట్స్ మరియు పండ్లను కూడా తక్కువగా తీసుకుంటూ ఉంటారు.
- సాల్ట్ మరియు పంచదార ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు.
- బర్గర్ మొదలైన ఆహార పదార్థాలను కూడా ఎక్కువగా తీసుకోరు.
- అంతేకాకుండా జపాన్ ప్రజలు ప్రభుత్వం పెట్టిన రూల్స్ ని అనుసరిస్తారు. తాజా ఆహారం ఇంట్లో చేసుకున్న ఆహారం తీసుకోవాలని జపాన్ ప్రభుత్వం చెబుతోంది ఆ విషయాన్ని వాళ్లు పాటిస్తారు.
#2. స్నాక్స్ తీసుకోరు:
Ads
జపాన్ లో ఉండే వాళ్ళు కిట్క్యాట్ వంటి చాకోలెట్స్ ని మొదలైన వాటిని తీసుకోరు. వీటికి దూరంగా ఉంటారు చాలా తక్కువ మోతాదులో మాత్రమే ఇటువంటివి తీసుకుంటూ ఉంటారు.
#3. ఫాస్ట్ ఫుడ్:
జపాన్ లో ఉండే ఫాస్ట్ ఫుడ్ కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇంట్లో చేసుకునేటట్టు ఉంటుంది.
అయితే ఇక్కడ KFC, మెక్‌డొనాల్డ్స్ వంటివి వుండవనుకుంటే పొరపాటే.
#4. తీసుకునే పోర్షన్ సైజ్:
జపాన్ లో ఒక కల్చర్ ఉంది. అదేంటంటే వాళ్ళు తక్కువ మోతాదులో మాత్రమే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు.చిన్న చిన్న ప్లేట్లలో వాళ్ళు సర్వ్ చేసుకుంటూ ఉంటారు.
#5. ఆస్వాదిస్తూ తింటారు:
ఎక్కువ మోతాదులో తీసుకోకుండా తీసుకునే వాటిని తక్కువ మోతాదులో ఆస్వాదిస్తూ తింటారు. జపాన్ లో తినేటప్పుడు గౌరవంగా ట్రీట్ చేస్తారు. ఫార్మల్ గా డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటారు.