బాలయ్య క్రేజ్ మాములుగా లేదుగా…తమిళ సినిమాలో కూడా “జై బాలయ్య” డైలాగ్.! ఎందులో అంటే?

Ads

చాలా మంది హీరోలు కేవలం తెలుగులో మాత్రమే సినిమాలు చేస్తారు. అయినా కూడా వారు వాడిన డైలాగ్స్, డాన్స్ చేసిన పాటలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవుతాయి. వేరే భాషల్లో సినిమాలు చేయకపోయినా కూడా, వేరే భాషల ఇండస్ట్రీలో మనుషులకి వాళ్ళు ఎవరు అనేది తెలిసి ఉంటుంది. తెలిస్తే సరే. సినిమాల్లో వాళ్ళు రిఫరెన్స్ కూడా వాడతారు. అలా చాలా తక్కువ మంది హీరోల విషయంలో జరుగుతుంది. ఇప్పుడు బాలకృష్ణ విషయంలో కూడా అలాగే జరిగింది.

నందమూరి బాలకృష్ణ. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని వ్యక్తి. భారతదేశం అంతటా కూడా బాలకృష్ణ అంటే అందరికీ తెలుసు. కానీ బాలకృష్ణ వేరే భాషల్లో సినిమాలు చేయలేదు. కేవలం తెలుగు సినిమాలో మాత్రమే ఇప్పటి వరకు బాలకృష్ణ నటిస్తూ వస్తున్నారు. అయితే, ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా హిందీలో కూడా డబ్ చేసి విడుదల చేశారు. ఇది థియేటర్లలో కాకుండా డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ లోనే విడుదల చేశారు.

balakrishna reference in a tamil movie

కానీ ఇందులో బాలకృష్ణ తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకున్నారు. బాలకృష్ణకి హిందీతో పాటు, తమిళ్ భాష కూడా వచ్చు. బాలకృష్ణ సినిమాలో చెప్పిన డైలాగ్స్ ని చాలా తెలుగు సినిమాల్లో రిఫరెన్స్ గా వాడటం అనేది చాలా సంవత్సరాల నుండి చూశాం. ఇప్పుడు ఒక తమిళ సినిమాలో కూడా బాలకృష్ణ రిఫరెన్స్ వాడారు. ఆ సినిమాని తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. అయితే, తెలుగులో డబ్బింగ్ చేసిన తర్వాత రిఫరెన్స్ ఏదో ఒకటి ఉండాలి అని బాలకృష్ణ డైలాగ్ పెట్టలేదు.

Ads

balakrishna reference in a tamil movie

డైరెక్ట్ తమిళ్ భాషలోనే ఈ సినిమాలో జై బాలయ్య అనే పదాన్ని వాడారు. యోగి బాబు హీరోగా నటించిన తూకుదురై అనే సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమాలో యోగి బాబు డైలాగ్ చెప్తూ “జై బాలయ్య” అని అంటారు. ఇది ఏదో తెలుగు సినిమాలో వింటేనే తెలుగు ప్రేక్షకులు ఈలలు వేసి, చప్పట్లు కొట్టి, గోల గోల చేస్తారు. అది ఒక తమిళ్ సినిమాలో మన తెలుగు హీరో రిఫరెన్స్ అంటే ఆనందం మామూలుగా ఉండదు కదా. అందుకే ఇప్పుడు ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి, “పక్క రాష్ట్రాల్లో కూడా మన బాలకృష్ణ క్రేజ్ మామూలుగా లేదు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

watch video :

ALSO READ : “సాయి ధరమ్ తేజ్” లాగానే… తన తల్లి పేరుని తన పేరుతో కలుపుకున్న ఈ తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..?

Previous article”నువ్వే కావాలి” హీరోయిన్ గుర్తున్నారా..? ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..?
Next articleజపాన్ లో వుండేవాళ్ళు సన్నగా ఉండడానికి 5 కారణాలు ఇవే..!