ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.? ఏడాది కూడా అవ్వకుండానే ఎంత మారిపోయాడో చూడండి.!

Ads

కొంతమంది సినిమా తారలని చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పాత్ర కోసం వీరు ఏం చేయటానికైనా సిద్ధపడతారు. ప్రాణాల మీదకి వస్తుందని తెలిసినా కూడా పెద్దగా పట్టించుకోరు. విక్రమ్ లాంటి హీరోలు ఈ విషయంలో మరొకడుగు ముందే ఉంటారు. అయితే ఇప్పుడు ఆ కోవ లోకే వస్తున్నాడు మరొక తమిళ్ హీరో ఆర్య. ఆర్య తెలుగు ప్రజలకి కూడా సుపరిచితుడే. అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమా లో విలన్ గా నటించి మెప్పించిన హీరో. రాజా రాణి, సైజ్ జీరో వంటి సినిమాలలో కూడా నటించాడు.

hero arya transformation

ఆర్య లేటెస్ట్ గా నటించిన తెలుగు చిత్రం వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్. ఇక విషయంలోకి వస్తే ఆర్య గత సంవత్సరం మిస్టర్ ఎక్స్ అనే సినిమాలో నటించడానికి సైన్ చేశాడు. ఆ తరువాత సినిమా కోసం కసరత్తులు చేయటం ప్రారంభించాడు. కండలు తిరిగిన దేహాన్ని సొంతం చేసుకుని ఆ దేహాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు ఆర్య.

hero arya transformation

Ads

వర్క్ స్టార్ట్ చేయడానికి ముందు ఫోటో, ప్రస్తుతం ఉన్న ఫోటో షేర్ చేసి గత ఏడాది మార్చిలో సినిమాకి సైన్ చేశాను, ఏప్రిల్ లో వర్కౌట్ స్టార్ట్ చేశాను, సెప్టెంబర్ లో సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది,ప్రజెంట్ లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది 2023 ఏప్రిల్ లో.. 2024 మార్చిలో నా లుక్ ఇలా ఉంది అని మ్యాటర్ కూడా పోస్ట్ చేశాడు.

hero arya transformation

ఊహించని రేంజ్ లో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన ఫ్యాన్స్ ఒకసారిగా షాక్ అయ్యారు. మైండ్ బ్లోయింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అని కొందరు, డెడికేషన్ అంటే అట్లుండాల అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక మిస్టర్ ఎక్స్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకి ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో గౌతమ్ కార్తీక్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాని ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నారు మూవీ మేకర్స్.

Previous articleజపాన్ లో వుండేవాళ్ళు సన్నగా ఉండడానికి 5 కారణాలు ఇవే..!
Next articleఉదయ్ కిరణ్, సౌందర్య లానే చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన 12 నటులు..!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.