నందమూరి హీరో “కళ్యాణ చక్రవర్తి” గుర్తున్నారా..? ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?

Ads

నందమూరి కుటుంబం నుండి ఎంతో మంది హీరోలు వచ్చారు. ఎన్టీ రామారావు గారితో మొదలైన ఈ కుటుంబ వారసత్వం, తర్వాత బాలకృష్ణ, హరికృష్ణ, వారి తర్వాత, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, నందమూరి చైతన్య కృష్ణ, ఇలా ఎంతో మంది నటులు నందమూరి కుటుంబం నుండి వచ్చారు.

వీరితో పాటు మరొక నటుడు కూడా ఈ కుటుంబం నుండి వచ్చారు. ఆయన పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. నందమూరి కళ్యాణ చక్రవర్తి ఎన్టీఆర్ గారి తమ్ముడు అయిన త్రివిక్రమ రావు గారి కుమారుడు. తన తండ్రి, పెదనాన్న సినిమా రంగంలోనే ఉన్న కారణంగా, చిన్నప్పుడే నటుడు అవ్వాలి అని కళ్యాణ చక్రవర్తి అనుకున్నారు.

nandamuri hero kalyan chakravarthy picture

1986 లో కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన అత్తగారు స్వాగతం అనే సినిమాలో మొదటిగా నటించారు. ఆ తర్వాత ఇంటి దొంగ, తలంబ్రాలు, మామ కోడళ్ళ సవాల్, మారణ హోమం, రౌడీ బాబాయ్, ప్రేమ కిరీటం వంటి సినిమాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లంకేశ్వరుడు సినిమాలో ఒక పాత్రలో నటించారు. ఇలా ఎంతో గుర్తింపు సంపాదించారు. అయితే కళ్యాణ చక్రవర్తి 2003 లో వచ్చిన కబీర్ దాస్ అనే సినిమాలో చివరిగా కనిపించారు.

nandamuri hero kalyan chakravarthy picture

Ads

అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ సినిమాల్లో నటించలేదు. గత సంవత్సరం నందమూరి తారకరత్న చనిపోయినప్పుడు అంత్యక్రియల సమయంలో కళ్యాణ చక్రవర్తి కనిపించారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్లీ కళ్యాణ చక్రవర్తి ఇప్పుడే కనిపించారు. హైదరాబాద్ వచ్చిన కళ్యాణ చక్రవర్తి ,తారక రత్న ఇంటి దగ్గర కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లను పలకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో కళ్యాణ్ చక్రవర్తిని మళ్లీ చాలా రోజుల తర్వాత ప్రేక్షకులు చూశారు. కళ్యాణ చక్రవర్తి వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే, కొడుకు పృథ్వి ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు.

nandamuri hero kalyan chakravarthy picture

కళ్యాణ చక్రవర్తి తమ్ముడు హరీన్ చక్రవర్తి కూడా కొన్ని సినిమాల్లో నటించారు. ఆయన కూడా చనిపోయారు. అదే ప్రమాదంలో త్రివిక్రమ రావు గారికి గాయాలు అయ్యాయి. దాంతో కళ్యాణ చక్రవర్తి చెన్నైలో తన తండ్రి బాగోగులు చూసుకుంటూ అక్కడే ఉండిపోయారు. త్రివిక్రమ రావు గారు చనిపోయిన తర్వాత కూడా కళ్యాణ చక్రవర్తి హైదరాబాద్ కి రాలేదు. వ్యాపారాలు చెన్నైలో ఉండడంతో అవి చూసుకుంటూ అక్కడే ఉన్నారు. అయితే అప్పట్లో కళ్యాణ చక్రవర్తి సినిమాల్లో కొనసాగి ఉంటే పెద్ద నటుడు అయ్యి ఉండేవారు అని చాలా మంది అన్నారు.

ALSO READ :

Previous article”కుంభకర్ణుడు” ఆరు నెలలు ఎందుకు నిద్రపోతుంటాడు..? బ్రహ్మ అలా చెయ్యడం వల్లేనా..?
Next articleఒకే లాగ కనిపించే 13 మంది హీరోయిన్స్.! లిస్ట్ లో ఎవరెవరున్నారో చూడండి.!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.