Ads
కంప్యూటర్ మన పనులని ఈజీ చేసేసింది. మనం ఈజీగా పనులని కంప్యూటర్ ద్వారా చేసుకోవచ్చు. ఇది వరకు ఏదైనా మనం రాయాలంటే ఎంతో కష్ట పడి పెన్ తో రాసేవాళ్ళం. కానీ కీబోర్డ్ తో ఇప్పుడు ఈజీగా మనం టైప్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. అలానే ఇంటర్నెట్ వలన ఎక్కడో జరిగిన విషయాలని మనం ఈజీగా ఇంట్లో కూర్చుని తెలుసుకోవచ్చు.
విద్యార్థులు మొదలు ఉద్యోగస్తుల వరకు ప్రతి ఒక్కరూ లాప్టాప్ లని కంప్యూటర్లని ఉపయోగిస్తున్నారు. అయితే మీరు ఈ విషయాన్ని గమనించారా..?
కంప్యూటర్ కీబోర్డ్ మీద ఉండే అక్షరాలు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉండవు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏ బి సి డి మొదలు జెడ్ వరకు. కానీ మనం కీబోర్డ్ మీద చూసినట్లయితే ఏ టు జెడ్ ఉండవు. పైన వరుస లో క్యూడబ్ల్యూఈఆర్, మధ్య వరుసలో ఏఎస్డిఎఫ్ కింద వరుసలో జెడ్ ఎక్స్ సివి ఇలా ఉంటాయి. అయితే ఎందుకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉండవు..? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంటే ఈజీగా మనం టైప్ చేసుకోవచ్చు కదా..? ఈ ఆర్డర్ ఎందుకు ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.
Ads
ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న కీబోర్డ్ ఇప్పుడు డిజైన్ చేసినది కాదు ఈ కీబోర్డ్ ని 1870లలోనే డిజైన్ చేశారు. దీనిని క్రిస్టోఫర్ అనే ఒక ఆయన డిజైన్ చేశారు. ఇప్పుడు మనం వాడుతున్న కీబోర్డ్ డిజైన్ ని క్వెర్టీ అని అంటారు. అప్పట్లో టైపు రైటర్ల కోసం కీబోర్డ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉండేది ఈజీగా మనం టైప్ చేసేయొచ్చు ఇలా ఉంటే. అలాంటప్పుడు కీస్ జామ్ అయిపోయేవి. దీంతో సమస్య ఎదుర్కోవాల్సి వచ్చేది. అందుకని కొన్ని వందల డిజైన్ల ని ప్రయత్నం చేశారు క్రిస్టోఫర్. ఆఖరికి ఇది డిజైన్ చేసారు. ఈ డిజైన్ తో మనం ఈజీగా టైప్ చేయొచ్చు పైగా సమస్యలు కూడా రావు అని క్రిస్టోఫర్ దీనిని తీసుకువచ్చారు.