Ads
ఎన్ని రకమైన సినిమాలు వచ్చినా కూడా, ప్రేక్షకులకి ఎప్పటికీ ఆసక్తికరంగా అనిపించే జోనర్ సినిమాల్లో హారర్ సినిమాలు ఒకటి. నిజంగా ఒక దర్శకుడు ఒక మంచి కథ రాసుకొని, హారర్ సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా చూస్తారు.
అందుకే ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఈ కాన్సెప్ట్ మీద సినిమాలు వస్తూనే ఉంటాయి. వీటికి భాషలతో కూడా సంబంధం లేదు. ఏ భాషలో హారర్ సినిమా వచ్చినా కూడా అది తెలుగులో డబ్ చేస్తారు. దాంతో తెలుగు ప్రేక్షకులు కూడా చూస్తారు.
సాధారణంగానే సినిమాలు అంటే ఆదరించే ఇండస్ట్రీ గురించి టాపిక్ వస్తే, తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందు వరుసలో ఉంటుంది. ఏ ఇండస్ట్రీ వాళ్ళు అయినా సరే, వాళ్ళ సినిమాల కాన్సెప్ట్ బాగుంది అని వాళ్ళకి నమ్మకం ఉంటే, అది తెలుగులో విడుదల చేస్తారు. అంటే సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎంత బాగా ఆదరిస్తారో చెప్పడానికి ఇవి ఉదాహరణలు. అయితే, ఇప్పుడు అలాగే కొంత కాలం క్రితం వచ్చిన ఒక హారర్ సినిమా ఇటీవల వచ్చిన హారర్ సినిమాల్లో బెస్ట్ హారర్ సినిమాగా నిలిచింది.
సాధారణంగా ఈ మధ్య హారర్ పేరుతో హారర్ కామెడీ, లేదా హారర్ అనే ఒక జోనర్ కి ఇంక ఏదైనా కూడా ఎమోషన్ ఒకటి కనెక్ట్ చేసి సినిమాలు తీస్తున్నారు. కానీ ప్యూర్ హారర్ సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. అలా కొంత కాలం క్రితం ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు భూతకాలం. ప్రముఖ నటి రేవతి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. షేన్ నిగమ్ ఈ సినిమాలో ఇంకొక ముఖ్య పాత్రలో నటించారు. సోనీ లివ్ లో ఈ సినిమా మాతృక మలయాళం భాషతో పాటు, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, విను (షేన్ నిగమ్) డి ఫార్మ్ పూర్తి చేసి ఉంటాడు.
Ads
విను, అతని తల్లి ఆశ (రేవతి) తో కలిసి ఉంటాడు. ఆశ తల్లి పెద్దావిడ. ఆ తర్వాత ఆశ తల్లి చనిపోతుంది. ఆశకి క్రోనిక్ డిప్రెషన్ ఉంటుంది. దాని వల్ల ఆశ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. విను ఇదంతా తట్టుకోలేక పోతాడు. అయితే ఒకసారి వినుకి ఇంట్లో ఏడుస్తోంది ఆశ కాదు అని తెలుస్తుంది. అసలు ఆ ఇంట్లో ఉన్నది ఎవరు? అలా ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే. సినిమా అంతా దాదాపు ఒకే ఇంట్లో నడుస్తుంది. ఎక్కువ పాత్రలు కూడా ఉండరు. అయినా కూడా దర్శకుడు చాలా గ్రిప్పింగ్ గా కథని రాసుకున్నారు.
రాహుల్ సదాశివన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇటీవల మమ్ముట్టి హీరోగా నటించిన భ్రమయుగం సినిమాకి కూడా రాహుల్ దర్శకత్వం వహించారు. గోపి సుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ఒక హైలైట్ అయితే, షెహనాద్ జలాల్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి మరొక హైలైట్ గా నిలిచింది. 2022 లో వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. హారర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఈ సినిమా చూస్తే అస్సలు నిరాశకి గురవ్వరు. ఇటీవల వచ్చిన బెస్ట్ హారర్ సినిమాల్లో ఒకటిగా భూతకాలం సినిమా నిలుస్తుంది.
ALSO READ : చిరంజీవి 10 క్లాస్ సర్టిఫికేట్ చూసారా..? అయన పుట్టిన ప్రదేశం ఏదో తెలుసా..?