Ads
ఎప్పుడైనా మీకు ఈ సందేహం కలిగిందా…? జోధ్పూర్ లో ఇళ్ళకి ఎందుకు నీలం రంగు వేస్తారు అని.. ఇది చాలా అందమైన సిటీ. భారతదేశంలో ఉండే అందమైన ప్రాంతాలలో జోధ్పూర్ కూడా ఒకటి. జోధ్పూర్ ని “Gateway to Thar” అని పిలుస్తారు. ఒకసారి కనుక మీరు జోధ్పూర్ వెళితే మీకు ఎన్నో ఏళ్ల క్రితం వెనక్కి వెళ్లినట్లు అనిపిస్తూ ఉంటుంది.
భారతీయ సంస్కృతి అక్కడ కనబడుతుంది. రాజస్థాన్లో ఉండే ప్రాంతాలలో జోధ్పూర్ రెండవ అతిపెద్ద ప్రాంతం. అయితే జోధ్పూర్ లో గోడలకి నీలం రంగు వేస్తూ ఉంటారు దాని వెనుక కారణాన్ని ఇప్పుడే చూద్దాం. దీని వెనుక ఎన్నో థియరీలు కూడా ఉన్నాయి.
ఎందుకు ఇక్కడ ఇళ్ళకి నీలం రంగుని వేస్తారు..?
- నీలం రంగు వలన చెదపురుగులు రావు:
నీలం రంగు చెదపురుగులుని రాకుండా చేస్తుందని చాలా మంది నమ్ముతారు. చెదలు వలన ప్రాచీన కట్టడాలు భవనాలు నాశనం అయిపోతాయని వాటిని కాపాడుకోవడానికి నీలం రంగుని ఉపయోగిస్తారని తెలుస్తోంది. కాపర్ సల్ఫేట్ లైమ్ స్టోన్ కాంబినేషన్లో ఈ రంగు ఉంటుంది. ఇది కీటకాలనీ దూరం చేస్తుంది. పైగా ఎంతో ప్రశాంతతని కలిగించే రంగు ఇది.
Ads
2. శివుడికి సంబంధించినది కూడా:
శివుడు ఇదే రంగు లో వుంటారు. అందుకే ఈ రంగుని వేస్తారని చాలామంది అభిప్రాయం. శివుడు విషాన్ని తీసుకున్న తర్వాత అతని శరీరం నీలం రంగులోకి మారింది. ఈ కారణంగా కూడా నీలం రంగు పెయింట్లుని అక్కడ వాడతారని అంటారు.
3. చల్లగా ఉంటుంది:
ఇది చాలా ముఖ్యమైన కారణం. నీలం రంగుని ఇళ్ళకి వేయడం వలన చాలా చల్లగా ఉంటుంది. రాజస్థాన్లో వేడి విపరీతంగా ఉంటుంది అయితే నీలం రంగు ఉండటం వలన ఇల్లు చల్లగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో మండుటెండ నుండి రక్షిస్తుంది నీలం రంగు.
4. సోషల్ స్టేటస్:
సోషల్ స్టేటస్ ని కూడా రిప్రెసెంట్ చేస్తుంది. రిపోర్టుల ప్రకారం చూస్తే బ్రాహ్మణులు అక్కడ నీలం రంగు పెయింట్ ని ఎక్కువగా ఉపయోగించే వారట. తక్కువ కులాలతో వాళ్లని వేరుగా చూపించుకోవడానికి నీలం రంగుని ఉపయోగించేవారు. అక్కడ బ్రాహ్మణులందరూ కూడా నీలం రంగు పెయింట్ ని వాడతారట దీనితో బ్రాహ్మణులు ఎవరనేది తెలుస్తుంది అని ఈ రంగుని ఉపయోగించేవారు అని రిపోర్టు చెబుతోంది.