ఎమ్మెల్యే “యశస్విని మామిడాల”కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..? ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే..!

Ads

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కొంతమంది యువ నాయకులు తమ సత్తా చాటారు. వారిలో ఒకరు మామిడాల యశస్విని రెడ్డి. రాష్ట్రంలోని పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారిగా యశస్విని రెడ్డి పోటీ చేసింది.

ఏ మాత్రం రాజకీయ అనుభవం లేకపోయినా 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై ఘన విజయాన్ని సాధించింది.

ఈ క్రమంలో ఈమె ఎవరు అంటూ ఆమె వ్యక్తిగత వివరాలు తెలుసుకోవటానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. యశస్విని రెడ్డి 1997 సంవత్సరంలో హైదరాబాదులో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు తిరుపతిరెడ్డి మాధవి. ఆమెకి ఒక చెల్లెలు కూడా ఉంది. ఈమె టెన్త్ వరకు ఎల్బీనగర్ శ్రీ చైతన్య స్కూల్లోనూ 2018 హైదరాబాదులోని శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి బీటెక్ ని పూర్తి చేశారు. 2019 సంవత్సరంలో ఝాన్సీ రెడ్డి, రాజేందర్ రెడ్డిల కుమారుడు రాజా రామ్మోహన్ రెడ్డి తో వివాహం జరిగింది.

Ads

అయితే యశస్విని రెడ్డి రాజకీయ ప్రవేశం అనుకోకుండా జరిగింది నిజానికి యశస్విని అత్త అయినటువంటి ఝాన్సీ రెడ్డికి వచ్చిన టికెట్టు పౌరసత్వం విషయంలో చిక్కులు రావటంతో టికెట్టు కోడలు యశస్విని రెడ్డికి దక్కడం జరిగింది. అయితే యశస్విని ఇటీవల చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా ప్రేక్షకులతో పంచుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి ఎలా జరిగింది అనే విషయం గురించి వివరంగా చెప్పారు.

ఇది మాత్రమే కాకుండా ఇంకా చాలా విషయాల గురించి ఈ యశస్విని మాట్లాడారు. ఇప్పుడు మరొక విషయం గురించి కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యశస్విని చెప్పారు. ఇంటర్వ్యూ చేస్తున్న మహిళ, “మీకు ఫేవరెట్ హీరో ఎవరు?” అని అడిగితే, “మహేష్ బాబు” అని సమాధానం చెప్పారు యశస్విని. “మహేష్ బాబు హీరో ఇష్టం” అని యశస్విని చెప్పారు. అందుకు ఇంటర్వ్యూ చేస్తున్న మహిళ, “మహేష్ బాబు ఫ్యానా మీరు?” అని అడిగితే, “అవును” అని యశశ్విని సమాధానం చెప్పారు.

watch video :

ALSO READ : ప్రేమలో ఫెయిల్యూర్ అయిన నలుగురు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ వీరే ..

Previous articleరైలు బ్రేకుని ఎందుకు సడన్ గా వెయ్యరు..? ఇంత ప్రమాదం జరగవచ్చా..?
Next article”జోధ్ పూర్” లో ఎక్కువ ఇల్లులన్నీ నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి.. కారణం ఏమిటంటే..?