“సెలవులు వద్దు” అంటూ ఒక విద్యార్థి లేఖ..! కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

Ads

చదువుకునే పిల్లలకి, అందులోనే ముఖ్యంగా స్కూల్ లో చదువుకునే పిల్లలకి సెలవులు వస్తున్నాయంటే ఎక్కడ లేని ఆనందం వస్తుంది. అసలు సెలవులు ఎప్పుడెప్పుడు వస్తాయో అని ఎదురు చూస్తూ ఉంటారు. సెలవులు వస్తే అది చేయాలి, ఇది చేయాలి అని అనుకుంటూ ఉంటారు.

హోంవర్క్ ఉండదు అని ఆనంద పడుతూ ఉంటారు. టీవీ చూడొచ్చు అని అనుకుంటారు. అయితే ఇటీవల ఒక విద్యార్థి మాత్రం సెలవులు వస్తున్నాయి అంటే బాధపడుతూ ఒక లెటర్ రాశాడు. వేసవి వస్తున్న కారణంగా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు హాఫ్ డే స్కూల్స్ నిర్వహించాలి అని షెడ్యూల్ జారీ చేసింది. స్కూల్ అయిపోయాక మధ్యాహ్నం భోజనం కూడా పెట్టి పంపించాలి అని చెప్పింది.

a boy heart touching letter about summer holidays

అయితే, యాదాద్రి జిల్లా రామన్నపేట మండలానికి చెందిన సాత్విక్ అనే ఒక అబ్బాయి మాత్రం సెలవులు వస్తున్నాయి అంటే బాధపడుతున్నాడు. మునిపంపులకి చెందిన సాత్విక్ తల్లిదండ్రులు నగేష్, స్వాతి, సాత్విక్ కి రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు విడిపోయారు.  అప్పటి నుండి సాత్విక్ వలిగొండ మండలం ఇస్కిల్లాలోని తన అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటూ, 5వ తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత తండ్రి నగేష్ దగ్గరికి వెళ్ళిపోయి ఏడవ తరగతి వరకు అక్కడ చదువుకున్నాడు. కానీ అమ్మమ్మ, నాన్నమ్మ ఇద్దరు కూడా పెద్దవారు కావడంతో సాత్విక్ ఆలోచనలో పడ్డాడు.

Ads

a boy heart touching letter about summer holidays

ఇప్పుడు నకిరేకల్ మండలం మూసి మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులంలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. దాంతో సాత్విక్ ఇప్పుడు బాధలో నోటుబుక్ లో ఒక లెటర్ రాసుకున్నాడు. “నా పేరు కే.సాత్విక్” అంటూ లెటర్ రాశాడు. “నేను రెండు సంవత్సరాల వయసులో మా తండ్రి తల్లి విడాకులు తీసుకున్నారు. విడాకుల సమయంలో పెద్ద మనుషులు అన్నారు. బాబు తల్లి దగ్గరే ఉంటా. పెద్ద వయసు వచ్చాక తన ఇష్టం. తల్లి దగ్గర కానీ, తండ్రి దగ్గర కానీ ఉండాలి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇస్కిల్లా.”

a boy heart touching letter about summer holidays

“మా అమ్మానాన్నది మేన సంబంధం. విడాకులు అయ్యాక నన్ను మా అమ్మమ్మ, తాత పెంచారు” అంటూ రెండు పేజీల లెటర్ రాసి, చివరిలో, “వేసవి సెలవులు ఇవ్వకండి. నేను స్కూల్ లో ఉంటాను. అన్నం పెట్టండి. కష్టపడి చదువుకొని పెద్ద స్థాయికి ఎదుగుతాను” అని రాశాడు. ఇది చూసిన క్లాస్ టీచర్, సాత్విక్ ని పిలిచి, అతని పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ లెటర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సాత్విక్ ఆటపాటల్లో కూడా మంచి ప్రతిభ కలవాడు అని టీచర్లు చెప్తున్నారు. ఈ లెటర్ చూసినవారికి మాత్రం కంటతడి ఆగట్లేదు.

ALSO READ : ఎమ్మెల్యే “యశస్విని మామిడాల”కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..? ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే..!

Previous article”జోధ్ పూర్” లో ఎక్కువ ఇల్లులన్నీ నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి.. కారణం ఏమిటంటే..?
Next article23 ఏళ్ల తర్వాత బాలకృష్ణతో కలిసి పని చేయబోతున్న స్టార్ హీరోయిన్..! ఎవరంటే..?