లోక్ సభ లో ”420” అనే సీటు ఎందుకు ఉండదు.. కారణం ఏమిటి..?

Ads

సాధారణ ప్రజలు పార్లమెంట్ ని చూడడానికి అనుమతి ఇవ్వరు. కనుక మనం పార్లమెంట్ ని చూడడానికి అవ్వదు. కానీ మనం పార్లమెంట్ ని టీవీలలో ఫోటోలలో చూస్తూ ఉంటాము. ఎలా పార్లమెంట్ ఉంటుంది..? ఎలా అక్కడ సీట్లు ఉంటాయి..? ఎలా డిజైన్ చేసి ఉంటుంది అని… పార్లమెంట్ లో సీట్లు అన్నీ కూడా చూసేందుకు గుండ్రంగా ఉంటాయి. రెండు పార్టీల ఎంపీలు కూర్చుంటారు.

అలానే కింద కుడి వైపున ప్రైమ్ మినిస్టర్ సీటు ఉంటుంది. స్పీకర్లు ఎదురుగా కూర్చుంటారు. మొత్తం 545 సీట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలే. కానీ మీకు ఈ విషయం తెలుసా..?

Ads

పార్లమెంట్ లో 420వ సీటు ఉండదని… మొత్తం 545 సీట్లు ఉంటాయి కదా మరి 420వ సీటు లేక పోతే 544 సీట్లు మాత్రమే ఉంటాయా.. అయితే 420వ సీటు ఎందుకు ఉండదు…? దాని వెనక కారణం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ విషయాన్ని బైద్యనాథ్ జై పాండా ఒడిషా ఎంపీ చెప్పారు. అయితే లోక్ సభ లో 420వ సీట్ అనేది నిజానికి ఉంటుంది. కానీ దాని పేరు 420వ సీట్ కాదు.

420కి బదులుగా ”419A ” అని రాసి ఉంటుంది. దీని వెనక కారణం ఏమిటంటే… 420 ఫ్రాడ్, నిజాయితీ లేకపోవడం, మోసం వంటి వాటికి లింక్ అయ్యి ఉంటుంది. దొంగతనం, ఫ్రాడ్స్, నిజాయితీ లేకపోవడం వంటి వాటి కోసం సెక్షన్ 420 ని తీసుకొచ్చారు. ఇంగ్లీషు లో చీటింగ్ పదానికి ఆ నెంబర్ కి సంబంధం ఉంది. 15వ లోక్ సభ సీట్లని ఇచ్చేటప్పుడు 420 వ సీటు ని అదే 419A ని బద్రుద్దీన్ అజ్మల్, అస్సాం యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (AIUDF) ఎంపీ కి ఇచ్చారు.

 

Previous articleరేణుదేశాయ్ ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతుందంటే..
Next articleఅమితాబ్ బచ్చన్ ఇంట్లో ”4 కోట్ల బుల్ పెయింటింగ్”… దాని వెనుక ఇంత కథ ఉందా…?