అమితాబ్ బచ్చన్ ఇంట్లో ”4 కోట్ల బుల్ పెయింటింగ్”… దాని వెనుక ఇంత కథ ఉందా…?

Ads

సెలబ్రిటీలు ఇళ్లల్లో ఖరీదైన వస్తువులు ఉంటాయి. అలానే సెలబ్రిటీలు ఖరీదైన వస్తువులను ఉపయోగిస్తారు. వాళ్ళు వేసుకునే దుస్తులు మొదలు వాడే ఫోన్, కారు ఇలా ప్రతిదీ కూడా కాస్ట్లీవి ఉంటాయి. అలానే సెలబ్రిటీలకి ఆస్తులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అలానే మనం సినిమాల్లో చూసినట్లు నటులు వాళ్ళ ఇళ్ళల్లో ధర ఎక్కువ వుండే వాటిని పెట్టి అలంకరిస్తూ ఉంటారు.

మీకు ఈ విషయం తెలుసా..? అమితాబ్ బచ్చన్ ఇంట్లో ఉండే బుల్ పెయింటింగ్ విలువ నాలుగు కోట్లు. అయితే ఎందుకు నాలుగు కోట్ల ని పెట్టి ఈ బుల్ పెయింటింగ్ ని అమితాబ్ బచ్చన్ కొన్నారు..?

Ads

దీనికి ఏమైనా స్పెషాలిటీ ఉందా లేదంటే ఇది సాధారణమైనదేనా..? ఈ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సెలబ్రిటీలు ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. సోషల్ మీడియాలో వాళ్ళ ఫొటోస్ ని కూడా షేర్ చేస్తూ ఉంటారు. అలానే ఏదైనా అప్డేట్ ఉన్నా కూడా పంచుకుంటూ ఉంటారు. ఒక దీపావళి రోజున అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ పిక్చర్ ని పోస్ట్ చేశారు. ఈ ఫోటో లో గోడకు ఉన్న పెయింటింగ్ అందర్నీ ఆకర్షించింది. దీనితో ఆ పెయింటింగ్ ఏమిటి..?, ఆ పెయింటింగ్ విలువ ఎంత అని ఆరా తీశారు నెటిజెన్లు.

అప్పుడు ఈ ప్రత్యేకమైన బుల్ పెయింటింగ్ విలువ నాలుగు కోట్లు అని తెలిసింది. ఈ పెయింటింగ్ ని ప్రసిద్ధ చిత్రకారుడు మంజిత్ బావ వేశారని తెలిసింది. పంజాబ్‌ లోని సంగ్రూర్ జిల్లాలోని ధురిలో ఈ చిత్రకారుడు జన్మించారు. ఢిల్లీలోని కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ లో ఈయన చదివారు. అప్పుడే ఆయన ప్రొఫెసర్ అబానీ సేన్ రోజుకు 50 స్కెచ్‌లు వేయించేవారట. ఇలా ఈయనకి కష్టపడే తత్త్వం అలవాటు అయ్యింది. ఈ బుల్ పెయింటింగ్ బలం, వేగం, ఆధిపత్యం, ఆశ మరియు శ్రేయస్సును సూచిస్తుంది.

Previous articleలోక్ సభ లో ”420” అనే సీటు ఎందుకు ఉండదు.. కారణం ఏమిటి..?
Next articleసినిమాల్లో హీరో హీరోయిన్లు వేసుకున్న “కాస్ట్యూమ్స్” ని.. సినిమా అయ్యాక ఏం చేస్తారు..?