Ads
ప్రతి ఊరు రైల్వే స్టేషన్ లో బోర్డులు ఉంటాయి. పసుపు రంగు పెద్ద బోర్డు ఉండి దాని మీద నల్లటి అక్షరాలతో ఊరు పేరు రాసి ఉంటుంది. ఇలా రాసి ఉండడం వలన మనం ఏ స్టేషన్ వచ్చిందని రైలు నుంచి కూడా చూసి తెలుసుకోవచ్చు. అయితే కొన్ని కొన్ని రైల్వేస్టేషన్లో బోర్డులని మీరు గమనించినట్లయితే ఊరు పేరు రాసి ఆ ఊరు పేరు పక్కన చివర ”రోడ్డు” అని రాసి ఉంటుంది. ఎప్పుడైనా మీరు దీన్ని గమనించారా..? ఇప్పుడే మనం దాని వెనుక రీజన్ ని తెలుసుకుందాం.
కొన్ని కొన్ని రైల్వేస్టేషన్ల బోర్డుల మీద ఊరు పేరు రాసి దాని పక్కన రోడ్డు అని రాయడానికి కారణం అక్కడ నుండి ఉన్న రహదారి మీదుగా నగరానికి వెళ్లాల్సి ఉంటుందని.. దాని వెనుక అర్థం నగరానికి కొంత దూరంలో మీరు రైలు దిగారని.. స్టేషన్ అక్కడ ఉంది కానీ మీరు ఊరు చేరుకోవడానికి రహదారి మీదుగా వెళ్ళాలి అని ఊరు పక్కన రోడ్డు అని రాస్తారు.
Ads
రైల్వే అధికారి ఒకరు ఈ విషయాన్నీ వెల్లడించారు. రోడ్డు అనే పదం ఆ రైల్వే స్టేషన్ నుండి నగరానికి వెళ్లడానికి కొంచెం సమయం దూరం పడుతుందని.. కొంచెం దూరంలో సిటీ ఉందని దాని వెనక అర్థం. ఆ నగరానికి వెళ్లే రైలు ప్రయాణికులు అక్కడే దిగి. కొంచెం దూరంలో వుండే ఊరు కి స్టేషన్ నుండి వెళ్లాల్సి ఉంది. ఈ దూరం రెండు కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు.
ఉదాహరణకి మనం నర్సీపట్నం తీసుకుంటే నర్సీపట్నం రోడ్డు అని రాసి ఉంటుంది బోర్డు మీద కేవలం నర్సీపట్నం అని రాసి ఉండదు. అలానే కొడైకెనాల్ నగరాన్ని చూసుకుంటే కొడైకెనాల్ రోడ్డు అని ఉంటుంది. రైల్వే స్టేషన్ కి 79 కిలోమీటర్ల దూరంలో ఊరు ఉంది. రాంచి సిటీ రాంచి రోడ్ స్టేషన్ నుండి 49 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హజారీబాగ్ రోడ్డు అయితే స్టేషన్ కి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కారణంగానే రైల్వే స్టేషన్ లో బోర్డు మీద ఊరు పేరు రాసి పక్కన రోడ్డు అని రాస్తారు.