పార్లమెంట్ లో సభ్యులు హెడ్ ఫోన్స్ ఎందుకు ఉపయోగిస్తారు..? దాని వెనుక కారణం ఏమిటి అంటే..?

Ads

సాధారణంగా మన ఇళ్లల్లో పాటలు వినడానికి మనం హెడ్ ఫోన్స్ కి ఉపయోగిస్తాము. పార్లమెంట్లో కూడా హెడ్ ఫోన్స్ ని ఉపయోగిస్తారు. వాళ్లు కూడా పాటలు వింటున్నారు అని మీరు అనుకుంటే అది పొరపాటే. పార్లమెంట్లో హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం వెనక పెద్ద కారణమే ఉంది మరి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పార్లమెంట్ సభ్యులు హెడ్ ఫోన్స్ ని పెట్టుకోవడానికి మీరు ఎప్పుడైనా గమనించారా? పార్లమెంట్ సభ్యులు హెడ్ ఫోన్స్ ని పెట్టుకుంటారు దాని వెనుక ఉండే కారణం తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఎవరైనా పార్లమెంట్ సభ్యులు మైక్ లో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్న భాషలోనే కాకుండా పేరు వేరు భాషల్లోకి కూడా ట్రాన్స్లేట్ చేయబడుతుంది.

Ads

ఒకవేళ కనుక ఎవరైనా సభ్యులు ఆ భాష తెలియకుండా వాళ్లకు తెలిసిన భాషలో వినాలంటే హెడ్ ఫోన్స్ ద్వారా ఆ భాషలో మాట్లాడే వ్యక్తి చెప్పేది వింటారు దీంతో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ భాష తెలియకపోయినా చెప్పే విషయాలను క్లియర్ గా హెడ్ ఫోన్స్ ద్వారా వినొచ్చు. ఏకకాలంలోనే సభ్యుడు మాట్లాడే భాష వేరు వేరు భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయబడుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి హిందీలో మాట్లాడుతున్నట్లయితే హెడ్ ఫోన్స్ ద్వారా ఇంగ్లీషులో లేదంటే ఆ సభ్యుడికి తెలిసిన భాషలో అవే విషయాలని వినొచ్చు. అంతేకాకుండా కొన్ని కొన్ని సార్లు పార్లమెంట్లో వాగ్వాదాలు వంటివి వినపడుతుంటాయి గందరగోళంగా ఉంటుంది.

వాయిస్ క్లియర్ గా ఉండదు. అలాంటప్పుడు హెడ్ ఫోన్స్ లో వాయిస్ ని వింటే క్లియర్ గా తెలుస్తుంది. ఆ సభ్యుడికి ఏం మాట్లాడుతున్నాడు అనేది క్లియర్ గా హెడ్ ఫోన్స్ ద్వారా వినొచ్చు. క్లియర్ గా స్పీచ్ వినబడుతుంది కాబట్టి హెడ్ ఫోన్స్ ని పెట్టుకుంటారు. ఈ కారణాల వల్లనే పార్లమెంట్లో సభ్యులు హెడ్ ఫోన్స్ ని పెట్టుకుంటారు. ముందు వరుస లో కూర్చున్న వాళ్ళకి ఆఖరి వరుసలో మాట్లాడే వాళ్ళు ఏం చెప్తున్నారో వినపడకపోవచ్చు. అలాంటప్పుడు కూడా హెడ్ ఫోన్స్ బాగా ఉపయోగపడతాయి. ఇలా క్లియర్ గా మాట్లాడుతున్నది వినొచ్చు. మంచిగా వినడానికి తెలిసిన భాషలో వినడానికి హెడ్ ఫోన్స్ బాగా హెల్ప్ అవుతాయి.

Previous articleరైల్వే‌స్టేషన్ల పేరు చివర ”రోడ్డు” అని ఎందుకు రాస్తారు..? దాని వెనుక కారణం ఏమిటి అంటే..?
Next articleఅంబేడ్కర్ విగ్రహాలు నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి..? కారణం ఏమిటి అంటే..?