ప్లేన్ క్రాష్ అయ్యే ముందు పైలట్ “మే డే” అని 3 సార్లు అన్నారు… కారణం ఏమిటో తెలుసా..?

Ads

విమాన ప్రయాణం చేయడం ఎంతో బాగుంటుంది. చాలా త్వరగా మనం మన గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. దూర ప్రయాణాలు కూడా సులభంగా ఉంటాయి. అదే రైలులో బస్సులో వెళ్లాలంటే రెండు మూడు రోజులు పట్టిస్తుంది. అలాంటిది గమ్యస్థానాన్ని కూడా మనం విమానంలో రెండు మూడు గంటల్లో చేరుకోవచ్చు. ఒక్కోసారి విమాన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఇప్పటికే చాలాసార్లు మనం విమాన ప్రమాదాల గురించి విన్నాం.

ప్లేన్ క్రాష్ అయిపోవడం వంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అయితే ప్లేన్ క్రాష్ అయ్యే ముందు పైలట్ మే డే అని ఎందుకు అంటారు..?  దాని వెనుక కారణం ఏమిటి..? ఏదైనా కోడ్ ఉందా.. ఉంటే దాని అర్థం ఏంటి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మే డే, మే డే, మే డే అని మూడుసార్లు పైలట్స్ అంటూ వుంటారు. అయితే ఎందుకు పైలట్ ఈ విధంగా చెప్తారు..? లాహోర్ నుండి కరాచీకి స్టార్ట్ అయిన విమానంలో అందరూ రంజాన్ సందర్భంగా ఇళ్లకు చేరుకుంటున్న వాళ్ళే. ఇంకొంచెం సేపట్లో గమ్యస్థానాన్ని చేరుకుంటాం అనగా విమానంలో సాంకేతిక సమస్య వచ్చింది. ఆ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కి చెప్పారు పైలట్. ఏటీసీ సిబ్బంది పైలట్ ని అప్రమత్తం చేశారు. రెండు రన్వేలు కూడా ఫ్లైట్ ల్యాండ్ చేయడానికి ఉన్నట్లు చెప్పారు.

Ads

మూడేళ్ళ క్రితం పాకిస్తాన్లో జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదంలో 97 మంది చనిపోయారు. అలానే ఎనిమిది మంది సిబ్బంది కూడా చనిపోయారు. పది నిమిషాలు అయితే విమానం ల్యాండ్ అయిపోయేది అందరూ సేఫ్ గా ఉండే వాళ్ళు కానీ దురదృష్టవశాత్తు ఈ విషాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం సంభవిస్తున్నప్పుడు పైలట్ మే డే, మే డే, మే డే అని మూడుసార్లు అన్నారు.

ఏటిసి సిబ్బంది అప్రమత్తం చేసినా కూడా పైలెట్ ఎంత ట్రై చేసినా విమానం కంట్రోల్ తప్పడంతో we have lost engine అని అన్నారు. విమానం క్రాష్ అయిపోయింది. విమానం 100% కూలిపోయింది. ఇంక ఆ పరిస్థితిని అసలు కంట్రోల్ చేయనప్పుడు మనం చేసేదేమీ లేనప్పుడు ఈ కోడ్ ని వాడతారు. చాలా అరుదైన ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే ఈ కోడ్ ని పైలట్ ఉపయోగిస్తారు. మే డే, మే డే, మే డే అని మూడు సార్లు చెప్తారు. పైలట్ విమానం క్రాష్ అయ్యే టైంలో ఈ కోడ్ చెప్తారు.

Previous articleవిరూపాక్ష సినిమా తో సిల్వర్ స్క్రీన్ పై మెప్పించిన సోనియా సింగ్ నటించిన.. టాప్ 10 షార్ట్ ఫిల్మ్స్ ఇవే..!
Next articleరైల్వే‌స్టేషన్ల పేరు చివర ”రోడ్డు” అని ఎందుకు రాస్తారు..? దాని వెనుక కారణం ఏమిటి అంటే..?