Ads
మనుషులు నియమాలు లేకుండా సొసైటీలో బ్రతకలేరు. అది మాత్రమే కాకుండా స్థిరమైన సమాజానికి నియమాలు కొన్ని అవసరం. అలా ప్రతి మతంలోనూ, కులంలోనూ వాటికి సొంత ఆచారాలు, పద్దతులు ఉంటాయి. వారు ఆ చట్రంలో జీవిస్తారు. ఇక నియమాల విషయానికి వస్తే నెలసరి లేదా ఋతుస్రావంకు కూడా ప్రాధాన్యత ఉంది.
మహిళలలో రుతుక్రమం సహజంగా జరిగే ప్రక్రియ. ఋతుస్రావం గురించి పురాతన కాలం నుంచి కూడా అనేక విశ్వాసాలు, ఆచారాలు పాటిస్తూనే ఉన్నారు. ఇక హిందూమతంలో కూడా అనేక ఆచారాలు, నమ్మకాలు ఉన్నాయి. నెలసరి సమయంలో మహిళలు పూజలు చేయకూడదని, పూజలకు సబంధించిన కార్యక్రమాలలో పాల్గొనకూడదని, అలాగే దేవాలయాలకు అసలు వెళ్లకూడదనే ఆచారం అనాదిగా వస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం భారతదేశం ఆధునికత వైపుగా ముందుకెళ్తోంది.
Ads
ఆ క్రమంలో నెలసరి, ఆ సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత పై సాధారణ ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. అయినా సరే చాలా చోట్ల నెలసరి వచ్చిన మహిళలను అపవిత్రంగానే చూస్తున్నారు. వంటగది, గుడికి, చెట్లను, పచ్చళ్లు మొదలైన వాటికి దూరంగా, తాకకుండా ఉండాలని పరిమితం చేస్తున్నారు. ఆ సమయంలో కనీసం స్త్రీకి ఎలాంటి వసతులు కూడా కల్పించడం లేదు. బహిష్టు సమయంలో స్త్రీ గుడికి, పూజలకు ఎందుకు దూరంగా ఉండాలనే దానిపై శాస్త్రీయ కారణాలు ఇప్పుడు చూద్దాం..దీనికి శాస్త్రీయ కారణం గురించి చెప్పాలంటే హార్మోన్లలో కలిగే మార్పులే. నెలసరి సమయంలో మహిళల శరీరంలో చాలా హార్మోన్లు మార్పులకు గురవుతాయి. దాంతో ఆ సమయంలో స్త్రీలకు కోపం, చిరాకు వస్తుంది. మనసు ప్రతికూలతతో ఉంటుంది.అంతేకాకుండా స్త్రీలు బహిష్టు సమయంలో బలహీనంగా ఉంటారని, మామూలు రోజు కన్నా చిరాకు, ప్రతికూలతతో ఉండడం వల్ల వంటగదిలో ఏదైనా గందరగోళం ఏర్పడవచ్చు. పాతకాలంలో కుటుంబంలో పదుల సంఖ్యలో సభ్యులు ఉండడం వల్ల అంతమందికి నెలసరి సమయంలో నిల్చుని వంట చేయడం కూడా చాలా కష్టంగా ఉండేది.
దానివల్ల ఆమెకు విశ్రాంతిని ఇవ్వడానికి వంటగదిలోకి రావద్దని చెప్పేవారు. పూజలు చేసేటప్పుడు లేదా గుడికి వెళుతున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలి. పూజలలో మంత్రాలు ఉచ్చరినచ్చేప్పుడు ఏకాగ్రత ఉండాలి. అయితే ఆ సమయంలో స్త్రీల మనసు ప్రతికూలతతో, చీరకుతో ఉంటుంది. ఎక్కువ సమయం ఏకాగ్రతగా కూర్చోలేరు. అందుకే వారిని పూజలు చేయకూడదని చెప్పేవారు.
Also Read: గోమూత్రం ఇంట్లో చల్లడం వాళ్ళ కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసా?