ఆపరేషన్ వాలెంటైన్ సెన్సార్ టాక్..! ఎలా ఉందంటే..?

Ads

వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. ఇందులో మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇది ఆమెకి తెలుగులో మొదటి సినిమా. ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగుతో పాటు, హిందీలో కూడా విడుదల అవుతోంది.

తెలుగులో ప్రముఖ డైలాగ్ సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ అందించారు. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా రేపు విడుదల అవుతోంది. సినిమా బృందం అందరూ కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.

operation valentine censor talk

హిందీలో కూడా వరుణ్ తేజ్ తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకున్నారు. అయితే, సినిమా ట్రైలర్ చూశాక, చాలా మంది హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ సినిమా గుర్తొచ్చింది అని అన్నారు. ఇది కూడా దేశభక్తి నేపథ్యంలోనే సాగుతుంది. పుల్వామా దాడుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమాకి యు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమాలో దేశభక్తికి సంబంధించిన అంశాలు చాలా ఉంటాయి అని, కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టించేలాగా ఉన్నాయి అని సెన్సార్ బృందం చెప్పినట్టు సమాచారం.

operation valentine censor talk

Ads

సాధారణంగా దేశభక్తి సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది అని అంటున్నారు. యాక్షన్ సీక్వెన్సెస్ రూపొందించిన విధానం కూడా బాగుంది అని చెప్పినట్టు సమాచారం. అంతే కాకుండా, సినిమాలో ఎమోషనల్ అంశాలు కూడా ఉన్నాయి అని అన్నారు. ఒక ప్రేమ కథ కూడా వీటన్నిటితో పాటు రన్ అవుతుంది అని, కానీ సినిమా మాత్రం దేశభక్తి అంశంతోనే ఎక్కువగా సాగుతుంది అని అన్నారు. వరుణ్ తేజ్ కి హిట్ పడుతుంది అని అంటున్నారు.

operation valentine censor talk

వరుణ్ తేజ్ గత సంవత్సరం గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని పొందలేదు. దాంతో ఇప్పుడు సమయం తీసుకొని ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఇది వరుణ్ తేజ్ హిందీలో మొదటి సారి నటిస్తున్న సినిమా. దాంతో ఏ ప్రాంతం నేటివిటీ అనే విషయానికి పరిమితం అవ్వకుండా దేశానికి, దేశంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన విషయాలని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా రూపొందించారు.

ALSO READ : “పవన్ కళ్యాణ్” కి ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా..? కానీ సినిమాల సమయంలో..?

Previous articleకూరగాయలు తెమ్మని ఈ భార్య తన భర్తకి చీటీ ఎలా రాసిచ్చిందో చూడండి… చూస్తే నవ్వు ఆపుకోలేరు..!
Next article“దీపికా పదుకొనే” చేసిన దాంట్లో ఏం తప్పు ఉంది..? ఎందుకు ఇలా అంటున్నారు..?