Ads
ISRO చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. ఏ దేశానికి సాధ్యం కాని విధంగా చంద్రుడిపై ఇస్రో పంపించిన విక్రమ్ ల్యాండర్ కాలు మోపింది. దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ అవతరించింది.
ఈ నేపథ్యంలో దేశమంతటా సంబరాల్లో మునిగితేలారు. కానీ విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని తాకగానే.. ఓ వ్యక్తి ఆ క్రెడిట్ తనదేనని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. అంతేకాకుండా ISRO ఉద్యోగిగా ప్రచారం చేసుకున్నాడు.
చంద్రయాన్ 3 మిషన్‌ను ప్రత్యేకంగా తయారు చేశామని, ఇటీవల మిషన్‌లో స్వల్ప మార్పులు చేయడంతోనే ల్యాండర్ డిజైన్ జాబిల్లిని తాకిందని అందరితో చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సూరత్‌కు చెందిన మితుల్ త్రివేది అనే వ్యక్తి ISRO పనిచేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. తాను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాతో కూడా కలిసి పనిచేస్తున్నట్లు చెప్పడం మరో విశేషం.
Ads
దీంతో రంగంలోకి దిగిన గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేపట్టగా.. మితుల్ త్రివేది వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, ఇన్‌స్టాలో ఇస్రో శాస్త్రవేత్తగా పేరు పెట్టుకున్నప్పటికీ ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఆయన పీహెచ్డీ చేసినట్లు చెప్పుకోవడం కూడా అబద్ధమేనని.. ఆయనకు కేవలం బీకాం డిగ్రీ మాత్రమే ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు ఆ వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
ALSO READ : చంద్రయాన్ 3 సక్సెస్ వెనకున్న ఇస్రో చైర్మన్ గురించి ఈ విషయాలు తెలుసా.? ఆయన నెల జీతం ఎంత అంటే.?