Ads
రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అరెస్ట్ పెద్ద కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి తన బాధ వెల్లడించడానికి ఏపీ ప్రజల ముందుకు వచ్చారు.
ధైర్యం కోసం ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న ఆమె.. తన బాధ మొరపెట్టుకోవడానికి అక్కడికి వచ్చినట్లు తెలియపరచారు.
ఒక బిడ్డ మనసు బాగా లేకపోతే బాధ పంచుకోవడానికి మొదట గుర్తుకు వచ్చేది తల్లిదండ్రులు మాత్రమే…. అలాగే నేను దుర్గమ్మ తల్లి దగ్గరకు నా బాధ చెప్పడానికి వచ్చాను. ఆయన్ను రక్షించమని కోరడానికి వచ్చాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నా భర్తకు మనోధైర్యాన్ని ప్రసాదించమని వేడుకున్నాను.. అని భువనేశ్వరి తెలిపారు.
ఆయన జరుపుతున్న పోరాటం ఆయన కోసం కాదు.. కేవలం ఏపీ ప్రజల స్వేచ్ఛ కోసం.. హక్కుల కోసం. ఆయన పడే తపనలో ఎటువంటి స్వార్థం లేదు…ఆంధ్ర రాష్ట్ర సంక్షేమం మాత్రమే ఉంది. చంద్రబాబు పోరాటం విజయం కావాలని.. ఈ నేపథ్యంలో ఆమె అందరికీ పిలుపు ఇచ్చారు…ఇది మీ హక్కు అని ఎలుగెత్తి చెప్పిన భువనేశ్వరి.. జై దుర్గా దేవి …జై హింద్ …జై అమరావతి అంటూ తాను చెప్పదలుచుకున్నవి రెండు ముక్కల్లో సూటిగా చెప్పి ముగించారు.
Ads
మరోపక్క నంద్యాల నుంచి విజయవాడకు మధ్యలో నడుస్తున్న చంద్రబాబు కాన్వాయ్ కాసేపట్లో విజయవాడకు చేరుకుంటుంది. ఈ సాయంత్రానికే ఆయన్ను విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టబోతున్నట్లు సిఐడి అధికారులు తెలియపరిచారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ స్కామ్ లో 241 కోట్లు అవినీతి జరిగిందన్న అభియోగం నెపంతో అధికార పార్టీ చేస్తున్న ఈ కుట్ర తో యావత్ ఆంధ్ర రాష్ట్రం అట్టుడుకుతోంది.
ముందు జాగ్రత్తగా వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే చంద్రబాబు అరెస్టు పేపర్ల పై సంతకం పెట్టారు.చంద్రబాబు పై ప్రస్తుతం 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్విత్ 34 and 37 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. చంద్రబాబుతో పాటుగా ఈ కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరియు అతని కొడుకు రవితేజ కూడా అరెస్టు అయ్యారు.
watch video :