ప్రభాస్ “సలార్” ట్రైలర్‌లో… ఈ 5 విషయాలు మైనస్ అయ్యాయా..?

Ads

ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

ట్రైలర్ లో చాలా మంది తెలిసిన నటీనటులు కనిపించారు. హీరోయిన్ శృతి హాసన్ ఒక షాట్ లో కనిపించారు. అలాగే శ్రియా రెడ్డి కూడా కనిపించారు. మరొక ముఖ్య పాత్రలో నటించిన జగపతి బాబు, కేజీఎఫ్ లో గరుడ పాత్రలో నటించిన నటుడు రామచంద్ర రాజు కూడా కనిపించారు.

minus points in salaar trailer

సినిమాలో హీరో పేరు దేవా అని ట్రైలర్ చూస్తే అర్థం అయ్యింది. ట్రైలర్ చూస్తూ ఉంటే చాలా చోట్ల కేజీఎఫ్ సినిమా గుర్తుకి వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది ఇలా ఉండగా ట్రైలర్ లో కొన్ని విషయాలు మాత్రం ప్రేక్షకులని నిరాశపరిచాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

minus points in salaar trailer

#1 ట్రైలర్ చూస్తున్నంత సేపు కేజీఎఫ్ సినిమాతో పోల్చి చూస్తున్నారు. సేమ్ డైరెక్టర్ నుండి వచ్చిన సినిమా అంటే ఆ పోలికలు సహజంగానే ఉంటాయి. కానీ కలర్ గ్రేడింగ్, కొంత మంది కేజీఎఫ్ లో ఉన్న పాత్రలు కూడా ఇక్కడ ఉండడంతో ఆ సినిమాతో ఎక్కువగా పోలికలు వస్తున్నాయి. అసలు ఒక కొత్త ట్రైలర్ చూస్తున్నాం అని ఎక్కడా అనిపించలేదు అని అంటున్నారు.

minus points in salaar trailer

#2 అసలు ఈ ట్రైలర్ చూసేది ప్రభాస్ కోసం. సినిమాకి ముందు రిలీజ్ చేసిన టీజర్ లో కూడా ప్రభాస్ ఎక్కువగా కనిపించలేదు. దాంతో కనీసం ట్రైలర్ లో అయినా ప్రభాస్ ని చూసుకునే అదృష్టం దొరుకుతుంది అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ప్రభాస్ చాలా తక్కువ సేపు కనిపించారు. దాంతో ఈ విషయం ఫ్యాన్స్ ని కాస్త నిరాశపరిచింది. తమ హీరో ఇంకా కొంచెం సేపు కనిపిస్తే బాగుండు అని అనుకున్నారు.

minus points in salaar trailer

#3 ఒక ట్రైలర్ ఎలివేట్ అవ్వాలి అంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే గొప్పగా ఉండాలి. దీనికి అర్జున్ రెడ్డి ఉదాహరణ. ఇప్పటికి కూడా అర్జున్ రెడ్డి టీజర్, ట్రైలర్ గుర్తు చేసుకుంటే అందులో ఉండే మ్యూజిక్ చాలా మందికి గుర్తు వస్తుంది. ఈ సినిమా ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పెద్దగా గుర్తులేదు. అలా అని బాగాలేదు అని కూడా లేదు. కాకపోతే గొప్పగా లేదు.

Ads

minus points in salaar trailer

#4 గత కొద్ది సినిమాల నుండి ప్రభాస్ డైలాగ్ డెలివరీలో మార్పు వచ్చింది. బేస్ వాయిస్ వల్ల అలా వస్తోంది అని చాలా మంది అంటున్నారు. కానీ ప్రభాస్ వాయిస్ మొదటి నుండి కూడా ఇలాగే ఉంది. అప్పుడు యాక్టివ్ గా డైలాగ్స్ చెప్పేవారు. బుజ్జిగాడు మేడిన్ చెన్నై సినిమాలో కూడా ప్రభాస్ ది ఇదే వాయిస్ కదా? కానీ అందులో అరిచి మాట్లాడినప్పుడు గొంతు గట్టిగానే వచ్చింది కదా? మరి ఇప్పుడు అరిచి మాట్లాడినా కూడా గట్టిగా వినిపించట్లేదు ఏంటి? ప్రభాస్ డైలాగ్ లో చాలా మార్పు వచ్చింది అని అంటున్నారు. డైలాగ్ స్పష్టంగా అర్థం అవ్వట్లేదు అని కామెంట్స్ చేస్తున్నారు.

minus points in salaar trailer

#5 ట్రైలర్ లో చాలా వరకు స్టోరీ అర్థం అయిపోతోంది. కొన్ని విషయాలని అయినా దాచి ఉంచే ప్రయత్నం చేస్తే బాగుండేది ఏమో అని అన్నారు. ఇప్పటికే ట్రైలర్ కొత్తగా లేదు అంటున్నారు. ఇలా స్టోరీ పాయింట్ ని కూడా చూపించడంతో అసలు కొత్త టైలర్ చూస్తున్నామని కూడా అనిపించట్లేదు అని కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి కనీసం కొన్ని విషయాలని అయినా, అందులోనూ ముఖ్యంగా హీరోకి, పృథ్వీరాజ్ కి మధ్య ఉన్న రిలేషన్ ని చూపించకుండా ఉండి ఉంటే బాగుండేది అంటున్నారు.

minus points in salaar trailer

ఏదేమైనా సరే ఇవన్నీ కూడా ట్రైలర్ వరకే పరిమితం అయితే బానే ఉంటుంది. ఎందుకంటే ప్రభాస్ కి హిట్ వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలని అందుకోగలిగితే మళ్ళీ ప్రభాస్ కి బాహుబలి తర్వాత హిట్ అయ్యే సినిమా ఇదే అవుతుంది. అందుకే అందరూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో. వేచి చూడాల్సిందే.

watch trailer :

ALSO READ : సుడిగాలి సుధీర్ నటించిన “కాలింగ్ సహస్ర” ఎలా ఉందంటే..?

Previous article10 రూపాయల టికెట్ తో రికార్డు సృష్టించిన బాలయ్య… ఏ సినిమాకంటే…?
Next articleపవన్ తో జక్కన్న రైటర్ మూవీ..! ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా..?