Ads
ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి, తమ నటనతో, గ్లామర్ తో తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకుని టాప్ హీరోయిన్ గా రాణించినవారు ఎంతోమంది ఉన్నారు. వారి అడుగుజాడల్లోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి స్టార్ హీరోయిన్ల చెల్లెల్లు కూడా హీరోయిన్ గా మారిన వారు ఉన్నారు.
Ads
అయితే అలా అక్క బాటలో ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అందుకున్నవారు చాలా తక్కువగా ఉంటారని చెప్పవచ్చు. కొందరు కొన్ని సినిమాల తరువాత ఫ్లాప్స్ ఎదురయ్యి సినిమాలకు దూరం అయినవారు ఉన్నారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఫ్లాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని, బిజినెస్ లో కోట్లు సంపాదిస్తున్న ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ హీరోయిన్లలో చాలామంది నటనతో పాటు ఇతర రంగాలలో కూడా పేరు తెచ్చుకున్నవారు ఉన్నారు. కొందరి హీరోయిన్లకి సొంత బ్రాండ్స్ ఉండగా, కొందరు నటీమణులు ఇంటీరియర్ డిజైన్ చేస్తూ, డబ్బుతో పాటు పేరు సొంతం చేసుకుంటున్నారు. అలా ఓ స్టార్ నటి సిస్టర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీతో హిట్ అందుకుని, ఆ తరువాత వరుస ఫ్లాప్స్ తో సినిమాలకు దూరం అయ్యింది. ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ చేస్తూ, కోట్లలో సంపాదిస్తోంది. ఆమె ఎవరో కాదు, షమితా శెట్టి. హీరోయిన్ శిల్పా శెట్టి చెల్లెలు.
షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ నటించిన ‘మొహబ్బతేన్’ మూవీతో షమితా శెట్టి కెరీర్ను మొదలుపెట్టింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు వచ్చాయి. దాంతో ఆమె కూడా తన అక్కలాగే రాణించానుకుంది కానీ ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచాయి. ఆమెకు ఫ్లాప్ హీరోయిన్ గా ముద్ర పడింది. దాంతో ఆమె సినిమాలకు దూరం అయ్యింది. షమిత చివరిసారి బిగ్ బాస్ లో కనిపించింది.
బిగ్ బాస్ హౌజ్ లో రాకేష్తో రిలేషన్ షిప్ గురించి వార్తల్లో నిలిచింది. అయితే ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు. షమిత బిజినెస్ లో అడుగు పెట్టి, గోల్డెన్ లీఫ్ అనే ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ వార్షిక టర్నోవర్ కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. ఈమె తెలుగు ఆడియెన్స్ కి సుపరిచితమే. ‘పిలిస్తే పలుకుతా’ అనే మూవీలో హీరోయిన్ గా నటించింది.
Also Read: “ఇది జోక్ కాదు..!” అంటూ… పూనం పాండేపై ఇంటింటి గృహలక్ష్మి హీరోయిన్ కామెంట్స్..!