డాడీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Ads

చాలా మంది బాల నటులుగా నటించి ఆ తర్వాత హీరో హీరోయిన్లుగా ఎదుగుతారు. ఇప్పటికే బాల నటులుగా సినిమాల్లోకి వచ్చి హీరోలుగా హీరోయిన్లుగా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీనా, రాశి మొదలు చాలా మంది హీరోయిన్లు మొదట బాల నటులుగా వచ్చి హీరోయిన్లుగా ఇండస్ట్రీ లో సెటిల్ అయ్యారు. మెగాస్టార్ కూతురుగా డాడీ సినిమాలో నటించిన ఆ చిన్నారి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చి ఇప్పుడు హీరోయిన్ అవ్వనుంది.

మెగాస్టార్ హీరోగా వచ్చిన డాడీ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది మెగాస్టార్ హీరోగా సిమ్రాన్ హీరోయిన్ గా ఆ సినిమాలో నటించారు. సిమ్రాన్ మెగాస్టార్ కూతురుగా ఈ చిన్నారి నటించి అందరినీ బాగా ఆకట్టుకుంది.

Ads

డాడీ సినిమాలో చిరంజీవి కి ఈ చిన్నారికి మధ్య సీన్స్ కూడా బాగుంటాయి. అందరిని బాగా ఆకట్టుకుంటాయి. అక్షయగా ఐశ్వర్య గా మెప్పించింది అనుష్క మల్హోత్రా. ఈ చిన్నారి కేవలం ఈ ఒక్క సినిమాతో అందరి మనసునే దోచుకుంది. ఇప్పుడు ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫొటోస్ ని షేర్ చేస్తుంది. అయితే ఈమె లో హీరోయిన్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ హీరోయిన్ గా రావాలని ఆశ పడుతున్నారు. మరి ఇక ఈమె హీరోయిన్ గా ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా నటించారు.

ఒక మంచి డాన్సర్ గా డాడీ సినిమాలో అల్లు అర్జున్ నటించి బాగా ఆకట్టుకున్నారు. ఎస్ ఏ రాజ్ కుమార్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ ఆధ్వర్యం లో ప్రొడ్యూస్ చేశారు. ఈ తెలుగు సినిమాని తమిళ్ హిందీలో కూడా డబ్బింగ్ చేశారు. 2001లో ఈ సినిమా వచ్చింది. సురేష్ కృష్ణ డాడీ సినిమాకి దర్శకత్వం వహించారు. ఐశ్వర్యగా అక్షయగా అనుష్క మల్హోత్రా మెప్పించారు. రాజేంద్రప్రసాద్, శరత్ బాబు, కోట శ్రీనివాసరావు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

Previous articleప్రేమలో ఫెయిల్యూర్ అయిన నలుగురు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ వీరే ..
Next articleఇండస్ట్రీలో ఫ్లాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ చెల్లెలు.. బిజినెస్ లో కోట్లు సంపాదిస్తున్న ఆ హీరోయిన్ ఎవరంటే..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.