“ఇది జోక్ కాదు..!” అంటూ… పూనం పాండేపై ఇంటింటి గృహలక్ష్మి హీరోయిన్ కామెంట్స్..!

Ads

ఇటీవల బాలీవుడ్ నటి పూనం పాండే తాను చనిపోయానంటు చేసిన రాద్ధాంతం అందరికీ తెలిసిందే.సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఇలా చేశానంటూ చెప్పిన పూనమ్ వీడియో ఇప్పటికే వైరల్ అయింది.

నిజంగా పూనం పాండే చనిపోయిందేమో అని అందరూ తర్వాత అది అబద్ధమని తెలిసి విసిపోయారు.అయితే ఈ వింత పబ్లిసిటీ స్టంట్‌పై సామాన్యులతో పాటు పలువురు సెలబ్రెటీలు కూడా ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. తాజాగా నటి కస్తూరి శంకర్ కూడా పూనమ్ పాండే ఇష్యూపై రియాక్ట్ అయింది.

kasturi shankar comments on poonam pandey

Ads

ఒక న్యూస్ ఛానల్ లో జరిగిన డిబేట్ లో కస్తూరి మాట్లాడుతూ పూనం పాండేని ఏకిపారేసింది. ఇటువంటి చీప్ పబ్లిసిటీ స్టంట్ తో సమాజానికి ఉపయోగపడేది ఏమీ లేదని చెప్పింది. పూనం పాండే మృతి అనేది పెద్ద విషయం కాదని తాను నిజంగా సర్వైకల్ క్యాన్సర్ పైన అవగాహన కల్పించాలంటే మరో విధంగా చేసి ఉండవచ్చు అని చెప్పింది.ఈ సందర్భంగా క్యాన్సర్ పేషెంట్స్ కోసం తాను చేస్తున్న ఛారిటీ గురించి కూడా కస్తూరి వివరించింది.

క్యాన్సర్ అనేది ఒక జోక్ కాదు. పిడియాట్రిక్ క్యాన్సర్ చిన్నారుల కోసం నేను ఒక ఛారిటీని రన్ చేస్తున్నాను. క్యాన్సర్ బాధితురాలైన నా అమ్మ పేరు మీద అది రన్ చేస్తున్నాను. క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన నా కూతురి పేరు మీద ఈ ఛారిటీ నడుపుతున్నాను అని వివరించింది నిజంగా పూనం పాండేకి క్యాన్సర్ పేషెంట్లు పట్ల బాధ ఉంటే చారిటీలకు కొంత డబ్బులు డొనేట్ చేసి అప్పుడు మాట్లాడాలని హితువు పలికింది.

Previous articleనారప్ప సినిమాలో “వెంకటేష్” తో పాటు… సినిమాల్లో కాళ్లు మొక్కే సీన్స్ చేసిన స్టార్ హీరోలు వీరే..!
Next articleఒకప్పుడు తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న హీరోయిన్ లైలా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.