Ads
శ్రీ పంచమి లేదా వసంత పంచమికి చాలా ప్రత్యేకత కలదు. ఈ పవిత్ర రోజున చదువుల తల్లి అయిన సరస్వతీ దేవి జన్మించిందని విశ్వసిస్తారు. అందువల్ల వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని పూజించాలని నమ్ముతారు.
వసంత పంచమిని తెలుగు క్యాలెండర్ ప్రకారం మాఘ మాసంలో వచ్చే శుక్ల పక్షంలో 5వ రోజున జరుపుకోవడం ప్రతి ఏడాది ఆనవాయితిగా వస్తోంది. ఈ ఏడాది వసంత పంచమి ఫిబ్రవరి 14న వచ్చింది. ఆ రోజు సర్వసతి దేవి మరియు లక్ష్మిదేవిని కూడా పూజించడం వల్ల కోరికలు తీరుతాయని నమ్ముతారు. సరస్వతి దేవి పూజించడం వల్ల జ్ఞానం, తెలివితేటలు పెరుగుతాయని భక్తులు విశ్వాసం.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా, వసంత పంచమి నాడు సర్వార్థ సిద్ధి యోగం, అశ్వినీ, రేవతి నక్షత్రాల కలయిక జరుగనుందని. దీని వల్ల రెండు రాశులవారికి శుభప్రదంగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వసంత పంచమి నాడు ఏ రాశులవారికి అదృష్టం కలుగబోతుందంటే..
మేష రాశి:
Ads
వసంత పంచమి నాడు ఏర్పడే నక్షత్రాల కలయిక, ప్రత్యేకమైన యోగాల వల్ల మేష రాశి వారికి చదువుకు సంబంధించిన వాటిల్లో మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారాల్లో పరిస్థితులు మారడం వల్ల లాభాలు పొందే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టేవారికి అనుకూల సమయం. అంతేకాకుండా అనేక కొత్త ఆదాయ వనరులు సైతం అందుబాటులో ఉంటాయి. కష్టానికి తగిన ఫలం లభిస్తుంది. ఏ పనులు ప్రారంభించినా ఆటంకాలు లేకుండా సులభంగా చేస్తారు.
మిథున రాశి:
వసంత పంచమి నాడు ఏర్పడే యోగం, నక్షత్రాల కలయిక వల్ల మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉండనుంది. ఈ రాశివారికి ఉద్యోగ మరియు వ్యాపారాలలో అనూహ్యంగా లాభాలు పొందనున్నారు. అంతేకాకుండా ఈ రాశివారికి వృత్తి పరంగా చాలా సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆర్దిక పరిస్థితులు కూడా మెరుగవుతాయి. ఈ సమయంలో మిథున రాశి వారికి ఉన్న అన్ని సమస్యల నుండి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు.
Also Read: వ్యాస మహర్షి చేతిరాతతో ఉన్న రాసిన మహాభారతంలోని పేజీలు చూశారా..?