వ్యాస మహర్షి చేతిరాతతో ఉన్న రాసిన మహాభారతంలోని పేజీలు చూశారా..?

Ads

వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వ్యాసుడు వేద వ్యాసుడు అయ్యాడు. వ్యాసుడు అష్టాదశపురాణాలు, మహాభాగవతం, మహాభారతంను రచించాడు. ఆయనను కృష్ణద్వైపాయుడు అని, బాదరాయణుడు అని కూడా పిలుస్తారు. సప్తచిరంజీవులలో వ్యాసుడు ఒకరు.

వ్యాస భగవానుడనిగా ప్రసిద్ధి చెందిన వేద వ్యాస మహర్షి ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు జన్మించాడు. ఆ రోజున గురు పూర్ణిమను జరుపుకుంటారు. వ్యాసుడు దాశరాజు కూతురు, మత్స్య కన్య అయిన సత్యవతి కుమారుడు. సత్యవతి సౌందర్యవతి అయినప్పటికీ ఆమె వద్ద భరించలేని చేపల వాసన వస్తుండేది.
అందువల్ల ఆమెను ఎవరూ ఇష్టపడలేదు. అందువల్ల ఎంతో బాధపడిన ఆమె అరణ్యంలో తిరుగుతూ ఒకనాడు  పరాశురుడి ఆశ్రమానికి చేరుకుంది. ఆమె అందాన్ని చూసి ఆమెను మోహించిన పరాశురుడు కోరికను తెలిపాడు. అందుకు ఆమె తాపసులైన తమకు తగదని వారించినా నిగ్రహించుకోలేకపోయాడు. ఆమె చేపల కంపు పోయి, పరిమళభరితమయ్యే, కన్యత్వం చెడిపోకుండా వరాన్ని సత్యవతికి ప్రసాదించాడు. వారి  సంగమ ఫలితంగా కృష్ణద్వైపాయుడు జన్మించాడు.
యమునా నది ద్వీపంలో నలుపు వర్ణంలో జన్మించడంతో ఆయనకు కృష్ణద్వైపాయుడు అనే పేరు వచ్చింది. పన్నెండేళ్ల తల్లి దగ్గర పెరిగిన వ్యాసుడు, ఆ తరువాత తపస్సు చేసుకోడానికి వెళ్ళాడు. వెళ్లే ముందు తల్లితో అవసరం వచ్చినప్పుడు తలచుకుంటే ఆక్షణమే వస్తానని చెప్పి వెళ్ళాడు. లోక శ్రేయస్సు కోసం ఘోర తపస్సు చేసిన వ్యాసుడు బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొందాడు. అష్టాదశ పురాణాలను,మహాభాగవతం, బ్రహ్మ సూత్రాలను రాసి భారతీయ సాహిత్యంలో ఎవరు చేరుకోలేని ఎత్తుకు ఎదిగాడు.
వేదాలను విభజించి, అందుబాటులోకి తెచ్చి వేదవ్యాసుడిగా పిలవబడ్డారు. పంచమ వేదం అయిన మహాభారతాన్ని వ్యాసుడు వ్రాయడానికి సంకల్పించాడు. తాను చెప్తుంటే భారతాన్ని వ్రాసే సమర్ధుని కోసం వినాయకుడిని ప్రార్థించాడు. అప్పుడు గణపతి ఎక్కడా ఆపకుండా చెప్తే వ్రాస్తానని చెప్పగా, సరే అని వ్యాసుడు, తాను చెప్పిన విషయాన్ని అర్ధం చేసుకొని వ్రాయాలని చెప్పారట. భారతాన్ని రాయడానికి గణపతి తన దంతాన్నే కలంగా వినియోగించాడట. అయితే వ్యాస మహాభారతంలోని కొన్ని పేజీలు ఇక్కడ ఉన్నాయి. మీరు చూసేయండి..

Ads

1.

2.

3.

4.

5.

6.

7.

Also Read: శ్రీరాముడు పూజించిన ఈ చెట్టును మీ ఇంట్లో పెంచుకోండి… దీని ప్రాముఖ్యత తెలుసా…?

Previous article24 ఏళ్ళ వయసులో సీనియర్ ఎన్టీఆర్, జగ్గయ్య గారికి రాసిన ఈ లెటర్ చూశారా..? ఇందులో ఏం రాశారు అంటే..?
Next articleపెళ్లికి ఇలాంటి గిఫ్ట్ కూడా ఇస్తారా..? ఈ వీడియో చూశారా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.