‘ఆదిత్య 369’ సినిమా టైటిల్ లో ‘369’ నంబ‌ర్ అర్థం ఏమిటో తెలుసా?

Ads

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన తన కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో నటించారు. ఆయన ఒకేరకమైన చిత్రాలలో కాకుండా అన్ని రకాల క్యారెక్టర్స్ లోనూ నటించాడు.

Ads

ప్రయోగాత్మక చిత్రాలలోనూ నటించి మెప్పించారు. అలాగే పౌరాణిక క్యారెక్టర్స్ లో కూడా బాలకృష్ణ అద్భుతంగా నటించి, మెప్పించారు. బాలకృష్ణ కెరీర్ లో నటించిన సినిమాలలో ‘ఆదిత్య 369’ ప్రత్యేకంగా నిలుస్తుంది. అప్పట్లో ఈ మూవీ రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు.
ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్ ను నిలబెట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమా టైం మిషన్ అనే విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఈ మూవీ 1991 లో విడుదలై రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే ఈ మూవీ టైటిల్ లో పెట్టిన 369 అనే నంబర్ కి అర్ధం ఏమిటో ఎవరికి తెలియదు.
బాలయ్యను ఒక ఇంటర్వ్యూ లో ఈ మూవీ టైటిల్ గురించి అడగడం జరిగింది. అప్పుడు ఆయన ఆదిత్య అనగా సూర్యుడు అని చెప్పాడు. నంబర్ గురించి అడిగినపుడు అది ఒక ప్రత్యేకమైన నంబర్ అని మాత్రమే తెలిపారు. అయితే 369 నంబర్ వెనక ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఈ నంబర్ కి పాజిటివిటి అనే అర్థం వస్తుందట. 3 అనగా మార్పు అని, 6 అనగా కొత్త ఆరభం అని, 9 అనగా విస్తరించడం అని అర్దం వస్తుందట.
అలాగే 369 అనే సంఖ్య గడియారంలో సమానంగా ఉండే సమయాన్ని సూచిస్తుంది. న్యూమరాలజీ  ప్రకారం ఈ నంబర్ అదృష్ట సంఖ్య అని నిపుణులు అంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కు కూడా ఈ నంబ‌ర్ అదృష్ట సంఖ్య కావ‌డం విశేషం. ఆయన పుట్టిన తేదీకి 369 నంబ‌ర్ కు ఒక లింక్ ఉంద‌ంట‌.
Also Read: సీనియర్ ఎన్టీఆర్ టూ చిరంజీవి.. ఎన్నో అవమానాలు ఎదుర్కొని స్టార్లుగా ఎదిగిన 7 గురు హీరోలు..

Previous articleతెల్ల చీర, ఎర్ర బ్లౌజ్ లో…మల్లెపూలు పెట్టుకొని అటు తిరిగి నించున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?
Next articleరేపే “వసంత పంచమి”…ఈ రెండు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..! మీ రాశి ఉందో లేదో చూసుకోండి.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.