విలన్ గా కూడా నటించి మెప్పించిన 8 మంది హీరోయిన్లు వీరే…ఎవరు ఏ సినిమాలో నెగటివ్ రోల్ అంటే.?

Ads

తెలుగు సినీ ఇండస్ట్రీలో అందం, అభినయంతో అలరించిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. టాలీవుడ్ లో హీరోయిన్లు అంటే పాటలు మరియు కొన్ని సీన్స్ కోసం అనే టాక్ కూడా ఉంది. అయినప్పటికీ హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న చాలా సినిమాలు తెలుగులో చాలానే వచ్చాయి.

తమ నటన, ప్రతిభతో టాప్ హీరోయిన్స్ గా ఎదిగినవారు చాలామంది ఉన్నారు. అయితే తెలుగులో హీరోయిన్లు పాజిటివ్ పాత్రలలో మాత్రమే కాకుండా విలన్ గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి, మెప్పించినవారు ఉన్నారు. అలా విలన్ పాత్రలో నటించిన కథానాయకలు ఎవరో? ఆ చిత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. రమ్యకృష్ణ:

ఒకప్పటి గ్లామర్ హీరోయిన్స్ లో రమ్యకృష్ణ ఒకరు. స్టార్ హీరోయిన్ గా ఎన్నో ఏళ్ల పాటు రాణించారు.  నరసింహా మూవీలో నీలాంబరిగా రజనీకాంత్ కు పోటీపడి మరీ నటించారు. ఆమె విలనిజం చూసిన వారు  ఇలాంటి మహిళలు కూడా ఉంటారా అని షాక్ అయ్యారు. రిపబ్లిక్ మూవీలో కూడా రమ్యకృష్ణ విలన్ గా నటించారు.2. సౌందర్య:

ఒకప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్యను తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. అయితే ఆమె కూడా నెగెటివ్ పాత్రలో నటించారు.”నా మనసిస్తారా” మూవీలో నటించారు. కానీ సౌందర్యను నెగెటివ్ గా ప్రేక్షకులు చూడలేకపోవడంతో ఆమె మళ్ళీ అలాంటి రోల్ లో నటించలేదు.

3. రాశి:

సీనియర్ హీరోయిన్ రాశి స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ళ పాటు రాణించింది. మహేష్ బాబు నటించిన  ‘నిజం’ మూవీలో నెగెటివ్ పాత్రలో నటించారు.

4. త్రిష:

Ads

స్టార్ హీరోయిన్ త్రిష హీరో ధనుష్ నటించిన ‘ధర్మయోగి’ మూవీలో విలన్ పాత్రలో నటించింది. ఈ చిత్రంలో త్రిష నటనకు ప్రశంసలు వచ్చాయి.

5. రీమాసేన్:

ఒకప్పుడు తెలుగు, తమిళంలో హీరోయిన్ గా రాణించిన హీరోయిన్ రీమాసేన్. ఆమె వల్లభ మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి, మెప్పించింది.

6. సమంత:

స్టార్ హీరోయిన్ సమంత కూడా విలన్ గా నటించింది. అయితే ఆ విషయాన్ని ఎవరూ నమ్మలేరు. కానీ మలయాళంలో  “విక్రం యూబీపత్తు ఎంద్రాకుల్లం” అనే మూవీలో పవర్ ఫుల్ విలన్ గా నటించి, మెప్పించింది. తెలుగులో ’10’ డబ్ అయ్యింది. 

7. కాజల్ అగర్వాల్:

టాలీవుడ్ చందమామగా పేరు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ కూడా  నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ‘సీత’ అనే మూవీలో నెగెటివ్ పాత్రలో మెప్పించింది.

8. వరలక్ష్మి శరత్ కుమార్:

కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా కి అంతగా గుర్తింపు రాలేదు. అయితే ఆమె విలన్ గా నటించడం ప్రారంభించిన తరువాత మంచి గుర్తింపుతో పాటు వరుస ఆఫర్స్  వస్తున్నాయి. తెనాలి సినిమా నుండి విలన్ రోల్స్ లోనే ఎక్కువగా నటిస్తోంది. రవితేజ ‘క్రాక్’ మూవీలోని జయమ్మ రోల్ తో చాలా పాపులర్ అయ్యింది. 

Also Read: 30 ఏళ్ల క్రితమే.. చిరంజీవి సినిమా టిక్కెట్ ధర ఎంత రేంజ్ కి వెళ్లిందో తెలుసా..? వైరల్ అవుతున్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్..!

Previous articleరేపే “వసంత పంచమి”…ఈ రెండు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..! మీ రాశి ఉందో లేదో చూసుకోండి.?
Next articleసినిమాలు లేకపోయినా గట్టిగా సంపాదిస్తున్న హనీ రోజ్..ఎలాగంటే.? ఆమె క్రేజ్ అలాంటిది మరి!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.