సంతోషం సినిమాలో నాగార్జున కొడుకుగా నటించిన బాలనటుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?

Ads

కె దశరధ్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సినిమా సంతోషం. 2002లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికి తెలుగు ఆడియెన్స్ కి గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీ టెలివిజన్ లో ప్రసారమైన ప్రతిసారీ మంచి రేటింగ్స్ ను దక్కించుకుంటుంది.

ఈ మూవీలో నాగార్జున సరసన గ్రేసీ సింగ్, శ్రీయ నటించారు. ఫ్యామిలీ నేపద్యంలో సాగే కథ కావడం, ఎమోషన్స్ చక్కగా పండడంతో ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలోని చాలా క్యారక్టర్స్ ఆడియెన్స్ కి ఇప్పటికి గుర్తుంటాయి. సంతోషం సినిమాలో హీరో నాగార్జున కొడుకుగా నటించిన బాల నటుడు కూడా గుర్తుంటాడు. ఈ సినిమాలో ఆ బుడ్డోడు బొద్దుగా, క్యూట్ గా ఉంటాడు. అయితే  ప్రస్తుతం చాలా అందంగా ఉన్నాడు.అతని పేరు అక్షయ్ బచ్చు. అక్షయ్ ఈ సినిమా కన్నా ముందు హిందీలో సినిమాలలో నటించాడు. హిందీలో సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అక్షయ్ నటించాడు. నాగార్జున ఒక హిందీ సినిమాలో అక్షయ్ యాక్టింగ్ చూసి, సంతోషం మూవీలో తన కొడుకుగా నటించే అవకాశం ఇప్పించాడు. ఈ మూవీ హిట్ అవ్వడంతో ప్రభాస్, త్రిష నటించిన బ్లాక్ బస్టర్ మూవీ వర్షంలో నటించాడు.

Ads

అంతేకాకుండా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన పోకిరి మూవీని బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ వాంటెడ్ గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో ఆయేషా టాకియా తమ్ముడి క్యారెక్టర్ లో అక్షయ్ నటించాడు.
అనతరం సినిమాలకు దూరంగా ఉండి తన స్టడీస్ ను కొనసాగించాడు. ప్రస్తుతం యంగ్ ఏజ్ లో ఉన్న అక్షయ్ బాలీవుడ్ లో పలు సినిమాలలో నటిస్తూ, హిందీ సీరియల్స్ చేస్తున్నాడు. బాలీవుడ్ లో సెటిల్ అయిన అక్షయ్ బాలనటుడిగా 12 సినిమాలలో నటించాడు. 45 కు పైగా యాడ్ ఫిలిమ్స్ లో నటించి పాపులర్ అయ్యాడు.

Also Read:మసూద సినిమాలో నజియా క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా?

Previous articleసౌత్ ఆఫ్రికా వాడు అయ్యుండి.. ఫాఫ్ డూప్లెసిస్ అరబిక్ టాటూ ఎందుకు వేయించుకున్నాడు..?
Next articleనిజ జీవితంలో పార్ట్‌నర్స్‌గా మారిన 10 మంది హీరోహీరోయిన్లు ఎవరంటే..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.