నిజ జీవితంలో పార్ట్‌నర్స్‌గా మారిన 10 మంది హీరోహీరోయిన్లు ఎవరంటే..!

Ads

వెండితెర మీద ఆడిపాడిన హీరో హీరోయిన్లను చూస్తుంటే ప్రేక్షకులకు మంచి ఫీలింగ్ కలుగుతుంది. అదే హీరోహీరోయిన్లు జంటగా సినిమాల్లో రిపీట్ అవుతుంటే వారిని హిట్ పెయిర్ అని పిలుస్తూ ఉంటారు.

మరి వారే నిజ జీవితంలో పెళ్లిచేసుకుని భార్యభర్తలుగా మారితే వారి అభిమానులు సంతోషంలో మునిగిపోతారు. అలా రీల్ లైఫ్ లోని జంటలు రియల్ లైఫ్‌ జంటలుగా మారిన వారు కోలీవుడ్ లో చాలామంది ఉంటారు. ఆనాటి ప్రేమ జంట జెమినీ గణేశన్, సావిత్రితో మొదలు పెడితే ఇటీవలే పెళ్లి చేసుకున్న ప్రేమ జంట గౌతమ్ కార్తీక్, మాంజిమా మోహన్ వరకు ఉన్న 10 జంటలు ఎవరో చూద్దాం..

Ads

1. జెమినీ గణేశన్ – సావిత్రి:
జెమినీ గణేశన్, సావిత్రి ఇద్దరూ గొప్ప నటులే. సావిత్రి తెలుగు, తమిళంలో మహానాటిగా పేరు తెచ్చుకుంటే, జెమినీ గణేశన్ తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో. సావిత్రితో నటించిన తరువాత ఆమెను ప్రేమించి మూడో పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరి బంధం విషాదంతో ముగిసింది.
2. రాధిక – శరత్ కుమార్:
రాధిక, శరత్ కుమార్ ఇద్దరు స్టార్స్.ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే శరత్ కుమార్ అంతకు ముందు ఛాయా దేవిని పెళ్లి చేసుకున్నారు. వారికి వరలక్ష్మీ శరత్ కుమార్, పూజా ఇద్దరు కూతుళ్లున్నారు. రాధిక, శరత్ కుమార్ లకి రాహుల్ అనే ఒక కొడుకున్నాడు.
3. ప్రభు – ఖుష్బు:
కోలీవుడ్ లెజెండరీ నటుడు శివాజీ గణేషన్ కుమారుడు ప్రభు. హీరోయిన్ ఖుష్బును ప్రేమించి, 1993లో పెళ్లి చేసుకున్నారు. అయితే విచిత్రంగా నాలుగు నెలలకే విడిపోయారు.
4. ఆర్. పార్థిబన్ – సీత:
పార్థిబన్, సీత ప్రేమించుకుని 1990లో పెళ్లి చేసుకున్నారు. కానీ 2001లో విడాకులు తీసుకుని విడిపోయారు.
5. రఘువరన్ – రోషిణి:
విలన్ క్యారెక్టర్లతో బాషా, శివ వంటి చిత్రాల్లో ఆకట్టుకున్న రఘువరన్, నటి రోహిణిని 1996లో పెళ్లి చేసుకున్నారు. కానీ 2004లో విడాకులు అయ్యాయి.
6. అజిత్ – షాలిని:
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, హీరోయిన్ షాలినితో ఒకే సినిమాలో నటించారు. ఆ షూటింగ్ సమయంలో ప్రపోజ్ చేసి, ఆమె ఒప్పుకోవడంతో 2000 పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.
7. సూర్య – జ్యోతిక:
కోలీవుడ్ హీరో సూర్య, హీరోయిన్ జ్యోతిక కలిసి 6 చిత్రాల్లో నటించారు. వీరిద్దరూ పెద్దల్ని ఒప్పించి 2006లో పెళ్లి చేసుకున్నారు. వీరికి పాప, బాబు ఉన్నారు.
8. ప్రసన్న – స్నేహా:
హీరోయిన్ స్నేహా, నటుడు, సింగర్ అయిన ప్రసన్నను ప్రేమించి 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి పాప,బాబు ఉన్నారు.
9. ఆర్య – సయేషా:
కోలీవుడ్ స్టార్ ఆర్య, కో స్టార్ సయేషాతో ప్రేమించి, పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
10. గౌతమ్ కార్తీక్ – మాంజిమా మోహన్:
తెలుగు,తమిళ పాపులర్ నటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్ కార్తీక్. హీరో గౌతమ్ కార్తీక్, నటి మాంజిమాను ప్రేమించి 2022లో పెళ్లి చేసుకున్నారు.
Also Read: భద్రినాథ్ మూవీలో నటించిన లేడీ విలన్ అశ్విని కల్సేకర్ భర్త ఎవరో తెలుసా?

Previous articleసంతోషం సినిమాలో నాగార్జున కొడుకుగా నటించిన బాలనటుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?
Next articleవిరూపాక్ష సినిమా తో సిల్వర్ స్క్రీన్ పై మెప్పించిన సోనియా సింగ్ నటించిన.. టాప్ 10 షార్ట్ ఫిల్మ్స్ ఇవే..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.