సౌత్ ఆఫ్రికా వాడు అయ్యుండి.. ఫాఫ్ డూప్లెసిస్ అరబిక్ టాటూ ఎందుకు వేయించుకున్నాడు..?

Ads

చాలా మందికి టాటూలు అంటే ఎంతో ఇష్టం సాధారణ ప్రజల మొదలు సెలబ్రిటీల వరకు ఎంతో మంది రకరకాల టాటూలని వేయించుకుంటూ ఉంటారు. క్రికెటర్లు కానీ నటులు కానీ ఏదైనా టాటూను వేయించుకుంటే అది హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఆ టాటూ వెనుక పరమార్ధాన్ని వెతుకుతూ ఉంటారు నెటిజెన్లు. అయితే ఊరికే టాటూ లని వేయించుకోరు కచ్చితంగా టాటూ వెనక ఏదో ఒక మీనింగ్ ఉంటుంది క్రికెటర్లు చాలామంది చేతికి టాటూలు ఉన్నాయి.

విరాట్ కోహ్లీ చేతినిండా టాటూలే కనబడుతుంటాయి. అలానే చాలా మంది క్రికెటర్లకి రకరకాల టాటూలు ఉన్నాయి. ప్రస్తుతం డుప్లెసిస్ టాటూ వైరల్ అవుతోంది. ఇక అసలు ఏమైంది.. ఆ పచ్చబొట్టు కి అర్థం ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం.

Ads

ఐపీఎల్-16 లో సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ అయ్యింది. ఆ మ్యాచ్ లో చెన్నై గెలిచింది. ఫాఫ్ డుప్లెసిస్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లతో ఎంతో ఆసక్తికరంగా సాగింది మ్యాచ్. కానీ జస్ట్ 8 పరుగుల తేడాతో బెంగళూరు జట్టు ఓడిపోయింది. బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కి గాయం అయినా సరే అద్భుతంగా ఆడాడు. 13వ ఓవర్లో అతడు 56 పరుగుల వద్ద వున్నప్పుడు కడుపు నొప్పి రావడంతో ఎంతో బాధ పడ్డాడు డుప్లెసిస్.

దానితో ఆ జట్టు ఫిజియో వచ్చి డుప్లెసిస్ కడుపునకు బ్యాండేజీ వేశారు. డుప్లెసిస్ రిబ్స్​ మీద ఉన్న టాటూ కనపడింది. డుప్లెసిస్ చాలా టాటూస్ వేయించుకున్నాడు. కానీ కడుపు నొప్పి రావడంతో ఈ కొత్త టాటూ బయట పడింది. ఈ టాటూ కి అర్థం ఏంటని అంతా చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా లో అయితే ఇది అరబిక్ భాష లోని పదము అని… దీనికి అర్థం ఫజెల్ (దేవుడి దయ) అని… దేవుడి దయ వల్లే లైఫ్​లో ఊహించని మార్పులు జరిగాయని. అందుకే డుప్లెసిస్ ఈ టాటూ ని వేయించుకున్నాడని అంతా అంటున్నారు.

 

Previous articleVirupaksha Review: సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్..!
Next articleసంతోషం సినిమాలో నాగార్జున కొడుకుగా నటించిన బాలనటుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?