Ads
సాధారణంగా సినీపరిశ్రమలో ఒక్క చిత్రం హిట్ అయ్యిందంటే చాలు రెమ్యునరేషన్లు పెంచుతూ ఉంటారు. కానీ అప్పట్లో ఒక సినిమాకు స్టార్ హీరోలకు రెమ్యునరేషన్ పది లక్షలు ఇస్తేనే వామ్మో అని నోరు తెరిచేవారు.
Ads
అంత పారితోషికమా అని అనుకునేవారు. ఇక 1990 నుండి హీరోల రెమ్యునరేషన్లు క్రమక్రమంగా పెరిగిపోతూ వచ్చాయని తెలుస్తోంది. టాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకు కోట్లలలో రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. మరి అప్పట్లో అగ్ర హీరోలు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం..సీనియర్ ఎన్టీఆర్:
అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేయాలంటే రు. 50 లక్షల బడ్జెట్ లో అయ్యేదంట. ఇక ఆ చిత్రానికి భారీగా సెట్స్ వేసి, సినిమా తీయాలంటే ఇంకో పది లక్షల వరకు అయ్యేది. అప్పట్లో ఎన్టీఆర్ చిత్రాలు మాత్రమే హై బడ్జెట్ లో ఉండేవి. ఇక ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు పారితోషకం రు. 12 లక్షల వరకు తీసుకునేవారని సమాచారం. ఆయన సినిమాలు కూడా విజయాన్ని పొందడమే కాకుండా అప్పట్లోనే ఆయన సినిమా కోటి నుండి మూడు కోట్ల వరకు కలెక్షన్స్ వసూల్ చేసేవని సమాచారం. అప్పట్లో సౌత్ సినీపరిశ్రమలో రెమ్యునరేషన్ లో ఎన్టీఆర్ టాప్ లో ఉండేవారట.
ఏఎన్నార్:
ఇండస్ట్రీకి మరో మహానటుడు అయిన అక్కినేని నాగేశ్వర రావు తనదైన నటనతో ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాడు. ఇక ఏఎన్నార్ సినిమాల బడ్జెట్ 30-40 లక్షలు వరకు అయ్యేదంట. ఆయన పది లక్షలు రెమ్యూనరేషన్ గా తీసుకునేవారని సమాచారం.
సూపర్ స్టార్ కృష్ణ:
సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో సంచలనాలకు మారు పేరుగా ఉండేవారని సమాచారం. హీరో కృష్ణ సినిమాల బడ్జెట్ 20- 25 లక్షల వరకు ఉండేదంట. ఇక ఆయన రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఒక్కో సినిమాకి 7 లక్షల తీసుకునేవారంట. కృష్ణ తన సినిమా ఏదైనా ప్లాప్ అయినా, ప్రొడ్యూసర్స్ కి నష్టాలు వస్తే ఆయన వెంటనే ఆ నిర్మాతలకు డేట్లు ఇచ్చి వారితోనే మరో సినిమా చేసేవారని చెబుతుంటారు. హీరో కృష్ణని నిర్మాతల హీరో గా పిలిచేవారు.
Also Read: జక్కన్న అతిధి పాత్రలో నటించిన 6 సినిమాలు ఏమిటో తెలుసా?