Ads
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ముఖ్యమైనది. సహజంగా తమ జీవితానికి ఒక తోడు కోసం, తమ వంశాభివృద్ధి కోసం పెళ్లి చేసుకుంటారు. ఇక పెళ్లికి ముందు వారి జీవితం ఎలా ఉన్నప్పటికి, పెళ్లి తరవాత వారు తమ భాగస్వామితో లైఫ్ చాలా అందంగా ఉండాలని అనుకుంటారు.
Ads
అలాగే ఊహించుకుంటారు. అది భార్య అవచ్చు, భర్త అవ్వచ్చు ఎవరైనా సరే పెళ్లికి ముందు అందమైన జీవితం కోసమే కలలు కంటారు. కానీ సంసారంలో కేవలం ఆనందాలు మాత్రమే ఉండవు, వాటితో పాటుగా బాధలు కూడా ఉంటాయి. మధురమైన క్షణాలే కాకుండా గొడవలు ఉంటాయి. అయితే భార్యభర్తలు కొన్నిసార్లు గొడవలు పడ్డప్పుడు కోపంలో నోటికి ఏది వస్తే అది, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటారు. ఇద్దరు ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటారు. అయితే భార్య తనకు ఎంత కోపం వచ్చినప్పటికి కూడా కొన్ని మాటలు తన భర్తను అనకూడదంట. మరి భార్య తన భర్తను అనకూడని ఆ మాటలు ఏమిటో చూద్దాం..
ఎప్పుడైనా ఏదైనా పెళ్ళికి కానీ, ఇంకేదైనా ఫంక్షన్ కి వెళ్లినప్పుడు అయినా, లేదా ఎవరైనా బంధువులు కానీ, స్నేహితులు ఉన్నప్పుడు అయినా వారి ముందు భర్తను భార్య తక్కువ చేస్తూ,చులకన చేసి అస్సలు మాట్లాడకూడదు.అలా మాట్లాడితే ఆయన గౌరవం తగ్గడమే కాకుండా భార్యకి చెడుపేరు వస్తుంది. ఇక భర్త గురించి భార్య చెడుగా చుట్టుపక్కల వాళ్లకు కానీ, ఇంకా ఎవరికైనా కానీ అసలు చెప్పకూడదు. కొంతమంది భార్యలు భర్త ఏదైనా అంటే ఇలా అన్నారని బయటకు చెప్పుకుంటారు. అలా చెప్పడం వల్ల ఆయనకు గౌరవం తగ్గుతుంది. కాబట్టి భార్యలు ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి.కొంతమంది భార్యలు భర్తల నిర్ణయాలను పట్టించుకోరు. భర్త చెప్పే వాటిని వెంటనే నిరాకరించకుండా, వారి నిర్ణయానికి తగ్గట్టు సలహాలను ఇస్తే మంచిది. ఇవే కాకుండా కొంతమంది భార్యలు పిల్లల ముందే తమ భర్తలను తిడుతూ ఉంటారు. ఇది పెద్ద పొరపాటు. ఎందుకంటే అలా తిట్టడంతో పిల్లలకు తమ తండ్రి పై ఉండే గౌరవం పోతుంది. పిల్లలు తప్పు చేసినాకూడా తండ్రిని గౌరవించకుండా, భయపడకుండా ఉంటారు. అందుకే పిల్లల ముందు భర్తలను అస్సలు తిట్టకూడదు.
Also Read:పదమూడేళ్లకే పెళ్లి, విడాకులు అయిన అమ్మాయి ఈ రోజు ఏ స్థాయిలో ఉందో తెలుసా?