బ్రో మూవీ టైటిల్ వెనక ఇంత కథ ఉందా?

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ కాంబినేషన్ లో వచ్చిన బ్రో చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి రికార్డులు సృష్టిస్తుందో మనందరికీ తెలుసు. ఒకపక్క ఏపీ రాజకీయాలను తలమునకలై ఉన్నప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు వెళ్తున్నాడు పవన్.

bro movie censor talk

రికార్డ్ టైంలో బ్రో సినిమాని కంప్లీట్ చేసి ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా సడన్గా ప్రేక్షకుల ముందుకు విడుదల చేశారు. ఇది వినోదయ సీతమ్ అనే తమిళ్ సినిమా రీమిక్స్ గా తమిళ్ డైరెక్టర్ సముద్రఖని డైరెక్షన్ లో తెరకెక్కింది. ఈ చిత్రంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన మ్యాజిక్ ను మరొకసారి చూపించారు.

Ads

అయితే ఈ మూవీకి ముందుగా వేరే టైటిల్ ని అనుకున్నట్లు సముద్రఖని వెల్లడించారు. తమిళ్లో ఈ మూవీ టైటిల్ వినోదయ సీతమ్ అంటే వెర్రి మనసు అని తెలుగులో అర్థం వస్తుంది. మొదట ఈ సినిమాకి కాలపురుషుడు అనే టైటిల్ బాగుంటుంది అని భావించారట.

భారీగా మాస్ గా ఉన్న టైటిల్ మూవీ యొక్క కంటెంట్ పై అంచనాలను మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మూవీకి సింపుల్గా జనాల్లోకి బాగా చొచ్చుకు వెళ్లే టైటిల్ కావాలి అని భావించారట. అందుకే ఈ చిత్రానికి షార్ట్ అండ్ స్వీట్ గా బ్రో అని టైటిల్ పెట్టారు. మొదటిసారి మామ అల్లుళ్ళ కాంబినేషన్లో చిత్రం రావడంతో మెగా ఫ్యాన్స్ బాగా ఖుష్ అవుతున్నారు.

 

Previous articleభార్య భర్తను ఎలాంటి స్థితిలో అయినా అనకూడని మాటలు ఏమిటో తెలుసా?
Next articleపవన్ నటించిన లాస్ట్ ఫైవ్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?