హీరో విక్టరీ వెంకటేష్ ముగ్గురు కుమార్తెలు ఏం చేస్తుంటారో తెలుసా?

Ads

తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా ప్రత్యేకమైన క్రేజ్ ను పొందిన అగ్ర నటుడు విక్ట‌రీ వెంక‌టేష్. ఆయన కెరీర్ తొలినాళ్ళ నుంచే కుటుంబ కథా సినిమాలతో ఆక‌ట్టుకోవ‌డంతో వెంక‌టేష్ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. గత ఏడాది ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ మూవీ ఎఫ్ 3తో ఆయన ఆడియెన్స్ ని పలకరించారు. ఇక ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.

Ads

అయితే ఫ్యామిలీ హీరోగా గుర్తింపు ఉన్న హీరో వెంక‌టేష్ నిజ జీవితంలో కూడా కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తాడు. ఆయన తన ఫ్యామిలీని మాత్రం ఇన్నేళ్లలో ఏ సినీమా వేడుకలకి గాని, సినిమా షూటింగ్స్ కి కానీ, వేరే ఏదైనా ఫంక్షన్స్ కి గాని తీసుకురాలేదు. అసలు ఇప్పటివరకు చాలా మందికి హీరో వెంకటేష్ కుటుంబం గురించి ఏమి తెలియ‌దు. ఆయన ఎప్పుడూ, ఎక్కడా కూడా తన ఫ్యామిలీ గురించి కానీ, వ్యక్తిగత విషయాల గురించి కానీ ప్రస్తావించలేదు.
ఇక వెంక‌టేష్ సతీమణి పేరు నీర‌జ. ఈ దంపతులకు నలుగురు సంతానం, ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. వెంక‌టేష్ పెద్ద కుమార్తె పేరు అశ్రిత, రెండవ కుమార్తె హ‌య‌వాహిని, చిన్న కుమార్తె పేరు భావన. కుమారుడు అర్జున్ రామనాధ్. ఇక వీరిలో వెంక‌టేష్ పెద్ద‌ కుమార్తె అశ్రిత‌కు హీరోయిన్ ల కుండే అంత ఫాలోయింగ్ ఉంది. ఆమెకు సోష‌ల్ మీడియాలో ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అయితే అశ్రిత‌ ఫాలోవ‌ర్స్ లో ఎక్కువ మందికి ఆమె హీరో వెంక‌టేష్ డాటర్ అనే విషయం తెలియ‌దు. ఎందుకంటే అశ్రిత వెంక‌టేష్ కుమార్తెగా కాకుండా ఫుడ్ వ్లాగర్ గా ఆహారానికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని సంపాచిందించుకుంది.
అశ్రిత ప్రస్తుతం త‌న భ‌ర్త‌తో క‌లిసి రెస్టారెంట్ బిజినెస్ లు నిర్వ‌హిస్తోంది. వెంక‌టేష్ రెండవ కుమార్తె హయవాహిని ఫ్యాషన్ డిజైనర్ రంగంలో ఎంట్రీ ఇచ్చింది. ఆమె చేసిన డిజైన్స్ కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తున్నాయని తెలుస్తోంది. ఇక మూడవ కుమార్తె భావన డిగ్రీ పూర్తి చేసుకుని, క్రీడారంగంలో రాణించడానికి ప్రయత్నిస్తోంది. దగ్గుపాటి వారసుడు,వెంక‌టేష్ కుమారుడు అర్జున్ చదువుకుంటున్నాడు. ఇక అర్జున్ ఇండస్ట్రీ ఎంట్రీ గురించి వెంకటేష్ స్టడీస్ పూర్తయిన తర్వాతే అని క్లారిటీ ఇచ్చారు.
Also Read: లవ్ టూడే మూవీ హీరోయిన్ ఇవానా షాజీ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు..

Previous articleనటి రోజా తండ్రి ఎవరో, ఆయన నేపద్యం ఏమిటో తెలుసా..?
Next articleహీరోలు చిరంజీవి, బాలయ్య, హీరోయిన్ రాధ.. ఈ ముగ్గురి లైఫ్ లో ఉన్న పోలిక ఏమిటో తెలుసా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.