హీరోలు చిరంజీవి, బాలయ్య, హీరోయిన్ రాధ.. ఈ ముగ్గురి లైఫ్ లో ఉన్న పోలిక ఏమిటో తెలుసా..?

Ads

టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇద్దరు రెండు కళ్ల‌ లాంటి వారు. వీరిద్దరూ తమ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు.

90లలో వీరిద్దరి సినిమాల మధ్య చాలా పోటీ ఉండేది. ఆడియెన్స్ కూడా అటు బాలకృష్ణ మాస్ యాక్షన్ ని, ఇటు మెగాస్టార్ కళ్ళుచెదిరిపోయే డ్యాన్స్ ని చాలా ఇష్టపడేవారు. ఇద్దరు కూడా తమ నటనతో ఆడియెన్స్ మనసుల‌లో స్థానం ఏర్పరుచుకున్నారు. ఇప్పటికీ అది మారలేదు.
వీరిద్దరి చిత్రాల్లోనూ హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ రాధ. హీరోయిన్ రాధ మలయాళీ. అయినా కూడా తెలుగు సినీ పరిశ్రమతో పాటుగా, ఆడియెన్స్ లోనూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకుంది. మెగాస్టార్ చిరంజీవితో గుండా, అడవి దొంగ, దొంగ, కొండవీటి రాజా, కొండవీటి దొంగ, యముడికి మొగుడు, రాక్షసుడు, స్టేట్ రౌడీ లాంటి సినిమాలలో చిరంజీవికి పోటీగా రాధ నటించి, మెప్పించింది. ఆమె బాలకృష్ణతో ముద్దుల కృష్ణయ్య, దొంగరాముడు, రాముడు భీముడు, రక్తాభిషేకం లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి, స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఆమె కెరీర్ చివరి దశలో ఉన్నప్పుడే వ్యాపారవేత్త రాజశేఖర్ వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది.

Ads

ఇక మెగాస్టార్,బాలయ్య,రాధ గురించే ఎందుకు అంటే ఈ ముగ్గురి మధ్యన ఒక ఇంట్రెస్టింగ్ పోలిక ఉంది కాబట్టి. ఇంతకి ఆ పోలిక ఏమిటి అంటే ముగ్గురికి కూడా ముగ్గురు సంతానం ఉండడం. అది కూడా ఇద్దరు అమ్మాయిలు, ఓ కుమారుడు ఉండటం విశేషం. బాలకృష్ణ కు కూడా బ్రాహ్మణి, తేజస్విని ఇద్దరు అమ్మాయిలు, మోక్షజ్ఞ అనే ఒక అబ్బాయి. చిరంజీవికి సుస్మిత, శ్రీజ ,రామ్ చరణ్. అలాగే హీరోయిన్ రాధకు కూడా ఇద్దరు అమ్మాయిలు, ఒక కుమారుడు. ఇక మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే రాధ ఇద్దరు కూతుర్లు కార్తీక, తులసి తమిళ, మలయాళ చిత్రాలలో కొనసాగుతున్నారు. కొడుకు విగ్నేష్ తండ్రిలా బిజినెస్ లో రాణిస్తున్నాడు.

Also Read: టాలీవుడ్ లో సర్జరీ చేయించుకున్న10 మంది స్టార్ హీరోయిన్స్..

Previous articleహీరో విక్టరీ వెంకటేష్ ముగ్గురు కుమార్తెలు ఏం చేస్తుంటారో తెలుసా?
Next articleమెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత భ‌ర్త నేపద్యం ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.