Ads
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. ఆయన తన కెరీర్ ను మాటల రచయితగా మొదలు పెట్టారు. తరుణ్, శ్రియ హీరోహీరోయిన్లుగా నటించిన నువ్వే నువ్వే చిత్రంతో త్రివిక్రమ్ దర్శకుడుగా మారారు.
Ads
ఈ మూవీ హిట్ అవ్వడం, ఆయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. దాంతో ఆయనకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. త్రివిక్రమ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలందరితోనూ సినిమాలు చేశారు. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, అల్లుఅర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో చిత్రాలను చేసి, ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చారు.
గత ఏడాది విడుదల అయిన భీమ్లా నాయక్ సినిమాకు బ్యాక్ బోన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అని డైరెక్టర్ తెలిపారు. పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా నటించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు రాయడంతో పాటుగా, స్క్రీన్ ప్లే అందిచారు. ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం మహేశ్ బాబుతో ఒక సినిమాను తెరకెక్కించనున్నారు. అయితే మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు త్రివిక్రమ్ మూడో సినిమా చేస్తున్నాడు. ఇండస్ట్రీలో మాటల రచయితగా వచ్చి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన ఆయనకు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేదు. అయితే ఈ విషయాన్ని త్రివిక్రమ్ తండ్రి భాస్కరరావు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
అది మాత్రమే కాకుండా త్రివిక్రమ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా చెప్పారు. భీమవరంలో జన్మించిన త్రివిక్రమ్ , అక్కడే తన చదువును పూర్తి చేశారు. ఆయన తండ్రి త్రివిక్రమ్ చదువు అవగానే ఉద్యోగం చేయాలని భావించేవారట. త్రివిక్రమ్ బీఎస్సీలో న్యూక్లియర్ చదవడంతో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో జాబ్ వచ్చిందట. అప్పుడు తన తండ్రితో నేను ఉద్యోగం చేయను, సినీ ఇండస్ట్రీలోకి వెళ్తాను అని చెప్పాడట. దాంతో త్రివిక్రమ్ తండ్రి నీ నచ్చిన దారిలోనే వెళ్లమని చెప్పారంట. అయితే టాలీవుడ్ లో త్రివిక్రమ్ లెక్చరర్ గా చేశారని ఒక టాక్ ఉంది. కానీ ఆయన తండ్రి త్రివిక్రమ్ లెక్చరర్ గా చేయలేదని, కొన్ని రోజులు కాన్వెంట్ లో పని చేశారని, అంతే కాకుండా త్రివిక్రమ్ ట్యూషన్లు కూడా చెప్పాడని తెలియచేసారు.
Also Read: థియేటర్లలో వేసే ఈ యాడ్ లో చిన్నారి మీకు గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే..?