మెగాస్టార్ చిరంజీవిని శ్రీదేవి నిజంగా అవమానించిందా..?

Ads

తెలుగు సిని పరిశ్రమలో సీనియర్ హీరోయిన్లలో జగదేక సుందరి శ్రీదేవి గురించి తెలియని వారు ఉండరని చెప్పవచ్చు. శ్రీదేవి తెలుగు పరిశ్రమలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. అయితే శ్రీదేవి ఒక చిత్రంలో నటించే విషయంలో మెగాస్టార్ చిరంజీవిని అవమాన పరించిందంట.మరి ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Ads

మెగాస్టార్ చిరంజీవి సినీ కెరిర్ లో విడుదల అయిన రోజు నెగిటివ్ టాక్ తో మొదలై, ఆ తరువాత సూపర్ హిట్ అయిన చిత్రాల్లో కొండవీటి దొంగ మూవీ ఒకటి. చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాకి కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలైన రోజే నెగిటివ్ టాక్ వచ్చింది.
ఈ మూవీ మెగాస్టార్ కెరిర్ లోనే అతి పెద్ద ప్లాప్ గా నిలిచిన లంకేశ్వరుడు సినిమా కంటే కూడా పెద్ద ఫ్లాప్ అనే  మాటలు వినిపించాయి. కానీ ఈ చిత్రం మెల్లి మెల్లిగా జనాలకు నచ్చడంతో ఈ సినిమా హిట్ టాక్ సంపాదించుకుంది. ఇక ఈ మూవీ అన్ని ప్రాంతాలలోను వసూళ్ల  వర్షాన్ని కురిపించింది. దాంతో మెగాస్టార్ చిరంజీవి కెరిర్ లో అత్యధికంగా కలెక్ట్ చేసిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.వాస్తవానికి ఈ మూవీలో  ముందుగా శ్రీదేవిని హీరోయిన్ గా భావించారంట. దాంతో చిరంజీవి శ్రీదేవి కలయికను దృష్టిలో ఉంచుకుని స్టోరిని రాశారు. ముందుగా ఈ స్టోరిని చిరంజీవికి చెప్పగానే ఆయన ఓకే అన్నారంట. ఆ తర్వాత దర్శకుడు కోదండ రామిరెడ్డి హీరోయిన్ శ్రీదేవికి స్టోరిని వినిపించారు. అయితే  శ్రీదేవి స్టోరీలో కొన్ని మార్పులు చేయమని సూచించారంట. ఆ మార్పులు ఏమిటంటే సినిమా పేరుని కూడా  కొండవీటి దొంగ స్థానంలో కొండవీటి రాణి అని మార్చాలని చెప్పారట.అది మాత్రమే కాకుండా టైటిల్ కార్డులో కూడా హీరో పేరు పక్కనే శ్రీదేవి అని వేయాలని చెప్పారంట. చిరంజీవి కన్నా తనకే ఎక్కువగా ఈ మూవీలో ప్రాధాన్యత ఉండాలని తెలిపారంట. దాంతో మూవీ యూనిట్  శ్రీదేవి కి బదులుగా హీరోయిన్ రాధాను తీసుకున్నారట. కొండవీటి దొంగ పేరుతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ హిట్ గా నిలిచింది. శ్రీదేవిఈ విధంగా మెగాస్టార్ చిరంజీవిని అవమాన పరిచిందని అప్పట్లో ఇండస్ట్రీలో టాక్.
Also Read: పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమాకి ముందుగా ఏ టైటిల్‌ అనుకున్నారో తెలుసా?

 

Previous articleరోబో సినిమాలో మొదట విలన్ అనుకొన్న రజిని కాంత్ హీరోగా మారడం వెనుక ఉన్న కథ..
Next articleపెళ్లిలో అరుంధతి నక్షత్రం చూపించడం అనే సంప్రదాయం వెనుక సైన్స్ ఉందా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.