పెళ్లిలో అరుంధతి నక్షత్రం చూపించడం అనే సంప్రదాయం వెనుక సైన్స్ ఉందా?

Ads

హిందువుల వివాహలలో ‘అరుంధతి నక్షత్రాన్ని’ వరుడు వధువుకు చూపించడం అనేది ముఖ్యమైన  సంప్రదాయంగా ఎన్నో తరాల నుండి వస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాంటి దక్షిణ భారత రాష్ట్రాలలో ఎక్కువగా ఈ సంప్రదాయం కనిపిస్తుంది.

అయితే  పగటి పూట జరిగే వివాహాలలోనూ ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. 16వ శతాబ్దపు తమిళ కవి అయిన తాండవరాయ స్వామి రాసిన ‘కైవల్య నవనీతం’ అనే గ్రంధంలో ఇటువంటి  దాని గురించి  రాశారు. భౌతిక, ఊహాజనితమైన వస్తువులను చూడడానికి సంబంధించిన వాక్యాలు ఆ గ్రంధంలో కనిపిస్తాయి. ‘దగ్గరలో ఉండే వృక్షాలను చూపించి, అనంతరం వాటి వెనక ఉన్న చందమామను చూపించినట్లుగానే, నక్షత్రాల గుంపును ముందుగా చూపించి వాటిలో ఉండే అరుంధతి నక్షత్రాన్ని  చూపిస్తారు’ అని రాశారు. అసలు అరుంధతి దర్శనం అనేది వివాహానికి సంబంధించినదేనా? అలా అయినట్లయితే ఆ కాలంలో రాత్రి పూటనే పెళ్ళిళ్ళు జరిగేవా? కానీ తాండవరాయ గ్రంధంలో పెళ్లి ప్రస్తావన అయితే లేదు. మరి అరుంధతి దర్శనానికి, వివాహానికి సంబంధం లేదా? అంటే వీటికి సమాధానాలు లేవు. అయితే అరుంధతి దర్శనం వెనుక సైన్స్ ఉందనే వీడియోలు ఈ మధ్యకాలంలో వైరల్ గా మారాయి. ఆకాశంలో ఉండే జంట నక్షత్రాల్లో ఒక నక్షత్రం స్థిరంగా ఉంటే, రెండో నక్షత్రం మొదటి నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే వశిష్ట, అరుంధతి జంట నక్షత్రాలు ఆదర్శ జంట వలె రెండు కూడా ఒకదాని చుట్టూ ఇంకొకటి తిరుగుతూ ఉంటుంది. వేల ఏళ్ల క్రితమే ఈ నక్షత్రాలను చూసి  సంప్రదాయాన్ని పెట్టారంటే నమ్మశక్యంగా లేదు అంటూ ఒక అమ్మాయి ఒక వీడియోలో తెలిపింది. అయితే ‘విజ్ఞాన్ ప్రసార్’లో సీనియర్ శాస్త్రవేత్తగా పని చేస్తున్న టి.వి.వెంకటేశ్వరన్ ఆ వీడియోలో అమ్మాయి చెప్పిన విషయాలు పూర్తిగా అవాస్తవమని వెల్లడించారు. ఎందుకు అంటే  మూడు కారణాలు కూడా చెప్పారు.1.భూమికి అల్కర్ నక్షత్రం 81.7 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. ఇక ఈ అల్కర్‌ నక్షత్రం ను  అరుంధతి నక్షత్రం అని చెబుతున్నారు. వశిష్టునిగా పరిగణించే మిజార్ నక్షత్రం అయితే 82.9 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. నిజానికి ఇవి జంట నక్షత్రాలు కావు. ఒకే దిశలో ఉండటంతో  ఆప్టికల్ ఇల్యూజన్‌ కారణంగా ఆ నక్షత్రాలు జంటగా ఉన్నాయని భ్రమ పడతారు. అలాంటి నక్షత్రాలను ‘డాజ్‌లింగ్ స్టార్స్’ అని ఖగోళశాస్త్ర భాషలో పిలుస్తారు.

Ads

2.ఇక అరుంధతి నక్షత్రంగా పరిగణించే అల్కర్ నక్షత్రం కు అల్కర్-బి అనే జంట స్టార్ ఉంది. అనగా  అల్కర్, అల్కర్-బి అనేవి రెండు జంట నక్షత్రాలు.

3. జంట నక్షత్రాల్లో 2 స్టార్స్ తిరుగుతూ ఉంటాయి. కానీ అవి ఒకదాని చుట్టూ ఇంకొకటి తిరగవు. రెండు స్టార్స్ మధ్య ఉండే ద్రవ్యరాశి కేంద్రం చుట్టూ అవి తిరుగుతుంటాయి.

Also Read: అలాంటి వారు మా వివాహానికి రావద్దు.. వెడ్డింగ్ ఇన్విటేషన్ వైరల్

Previous articleమెగాస్టార్ చిరంజీవిని శ్రీదేవి నిజంగా అవమానించిందా..?
Next article”వాలి” చనిపోయేముందు ”రాముడి” ని అడిగిన ప్రశ్న ఇదే…!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.