విజయ్ దళపతి ‘లియో’ ప్రోమోను ఆ తెలుగు సినిమా నుండి కాపీ చేశారా?

Ads

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ దళపతి నటిస్తున్న మూవీ టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా దళపతి 67 వర్కింగ్ టైటిల్ తో ప్రారంభం అయ్యింది. గతంలో లోకేష్ విజయ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్టార్ మూవీ భారీ విజయాన్ని సాధించింది.

మరోసారి ఈ హిట్ కాంబినేషన్ లో రాబోతుండడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చిత్ర యూనిట్ ఈ సినిమా టైటిల్ లియో-బ్లడీ స్వీట్ అని ప్రకటిస్తూ, ప్రోమోను విడుదల చేశారు. అయితే ఈ మూవీ అప్డేట్ కోసం ఎదురు చూసిన విజయ్ అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. దానికి కారణం ఏమిటంటే ఒక తెలుగు మూవీ నుండి ఈ ప్రోమో కాపీ చేశారనే టాక్ రావడమే. ప్రస్తుతం ఈ రెండు సినిమా ప్రోమోలను పోలుస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ ఏ తెలుగు మూవీ నుండి కాపీ చేశారని అంటున్నారో? ఆ మూవీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
యాక్షన్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న మూవీ లియో-బ్లడీ స్వీట్. లోకేష్ గత ఏడాది కమల్ హాసన్ తో తెరకెక్కించున విక్రమ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా తరువాత లోకేష్ డైరెక్షన్ చేస్తున్న సినిమా అవడం, అందులోనూ విజయ్ తో సినిమా చేస్తుండడంతో ఈ సినిమా పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియో నిర్మిస్తోంది. ఈ క్రేజీ మూవీలో కాస్టింగ్, నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాల పరంగా కూడా భారీగా ఉండబోతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిషను ఎంపిక చేశారు.
లియో ప్రోమోను విడుదల అయినప్పటి నుండి  నెటిజన్లు ఈ మూవీ గత ఏడాది తెలుగులో వచ్చిన  అక్కినేని నాగార్జున యాక్షన్ మూవీ ‘ది ఘోస్ట్’ ప్రోమోలా ఉందని, ఆ మూవీ నుండి కాపీ చేశారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ రెండు ప్రోమో వీడియోలను షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. రెంటింటి ని పొలుస్తూ మీమ్స్ పెడుతున్నారు.
Also Read: మంచు మనోజ్ పెళ్లి ఆ స్టార్ హీరోయిన్ లాగే చేసుకున్నాడా?

Ads

Previous articleనందమూరి ఫ్యామిలిలో ఉన్న ఈ చీకటి కోణాల గురించి తెలుసా?
Next articleఇప్పటి వరకు ‘ఆస్కార్’ గెలిచిన 8 మంది భారతీయులు వీరే.
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.