ఇప్పటి వరకు ‘ఆస్కార్’ గెలిచిన 8 మంది భారతీయులు వీరే.

Ads

సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం అయిన ఆస్కార్ అవార్డులకు ఈ సంవత్సరం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటి దాకా 95 ఆస్కార్ వేడుకలు జరుగగా, వాటిలో ఆస్కార్ గెలుచుకున్న ఇండియన్స్ అతి తక్కువగా ఉన్నారు.ఇప్పటివరకు ఎంత మంది ఇండియన్స్ ఆస్కార్ అవార్డు అందుకున్నారో ఇప్పుడు చూద్దాం..

1.భాను అథైయా(1983):
1983లో తొలిసారి ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్న భారతీయురాలు భాను అథైయా. ‘గాంధీ’ చిత్రానికి గానూ ‘బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్’ గా ఆమె ఆస్కార్ అవార్డ్ ను అందుకున్నారు. ఈ చిత్రం 1982లో రిలీజ్ అయ్యింది.
2.సత్యజిత్ రే(1992):
భారతీయ సినీ హిస్టరీలో శాశ్వతంగా నిలిచిపోయే పేరు సత్యజిత్ రే. ఆయన కెరీర్ లో 36 సినిమాలను తెరకెక్కించారు. చిత్ర రంగానికి ఆయన అందించిన విశేష సేవలకు గానూ ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ 1992లో సత్యజిత్ రేని హానరరీ అవార్డుతో గౌరవించింది. ఈ అవార్డు అందుకున్న ఏకైక ఇండియన్ గా సత్యజిత్ రే చరిత్రలో నిలిచిపోయారు.
3.గుల్జార్(2009):
స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గుల్జార్ ఆస్కార్ గెలుచుకున్నారు. ఈ మూవీలోని ‘జయహో’ పాటకి లిరిక్స్ కి గాను ఆస్కార్ అందుకున్నారు. 4.ఏఆర్ రెహమాన్(2009):
ఇండియా నుండి ఇప్పటివరకు 2 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఒకేఒక వ్యక్తి రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీకి గాను ఒరిజినల్ సాంగ్ మరియు ఒరిజినల్ స్కోర్ విభాగాలలో రెహమాన్ 2 ఆస్కార్ అవార్డులను గెలుచుకొని చరిత్ర సృష్టించారు.

Ads


 5.రసూల్ పూకుట్టి(2009):
స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీకి గాను ఉత్తమ సౌండ్ మిక్సింగ్ విభాగంలో రసూల్ పూకుట్టి ఆస్కార్ అందుకున్నారు. ఆ చిత్రానికి ఇయాన్ ట్యాప్, రిచర్డ్ ఫ్రెక్ లతో కలిసి ఆయన ఈ అవార్డు పొందారు.


  6.గునీత్ మోంగా(2019):
2019లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో గునీత్ మోంగా రూపొందించిన ‘పీరియడ్ ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్’ కి గానూ ఆస్కార్ అందుకుంది.

7. కీరవాణి – చంద్రబోస్ (2023):
ఈ ఏడాది జరిగిన 95వ ఆస్కార్ అవార్డ్స్‌ వేడుకలో రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్.ఎమ్. కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్ లను అందుకున్నారు.
8. కార్తికి గొన్సాల్వేస్ – గునీత్ మోంగా(2023):
95వ ఆస్కార్ అవార్డ్స్‌ లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కి గాను గునీత్ మోంగా మరియు డైరెక్టర్ కార్తికి గొన్సాల్వేస్ ఇద్దరు కూడా ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. గునీత్ మోంగాకి ఇది రెండవ ఆస్కార్.
Also Read: నితిన్ టు శ్రీముఖి.. నిజామాబాద్ జిల్లా నుండి వ‌చ్చిన 7 గురు ప్రముఖులు వీరే..!

Previous articleవిజయ్ దళపతి ‘లియో’ ప్రోమోను ఆ తెలుగు సినిమా నుండి కాపీ చేశారా?
Next articleKabzaa Review: ఉపేంద్ర ”కబ్జా” సినిమా హిట్టా..?, ఫట్టా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.